Sunil: సునీల్ సినీ కెరీర్ ను ముంచేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏం జరిగిందంటే?

Sunil: తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే హీరో, కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒకే రూమ్ లోనే ఉండేవారట. అంతేకాకుండా సినిమా అవకాశాల కోసం ఇద్దరూ ఎన్నో రకాల అవస్థలను పడినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు సునీల్, త్రివిక్రమ్. అలా ఇద్దరు ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అలాంటిది త్రివిక్రమ్ ఒక విషయంలో దారుణంగా మోసం చేస్తున్నాడట.

ప్రస్తుతం వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ సునీల్ కు తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తానని గతంలో మాట ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆ మాటకు కట్టుబడి సినిమాలలో అవకాశాలను ఇస్తున్నాడు కానీ ఆ పాత్రలు చేయడం వల్ల సునీల్ కి పెద్దగా ఉపయోగపడటం లేదు.. స్కిన్ మీద అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రలను ఇస్తూ సునీల్ ను మోసం చేస్తున్నాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ సినిమాలలో సునీల్ పాత్ర చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుమానం కలగక మానదు.

 

నటుడిగా మంచి మంచి సినిమాలు చేస్తున్న సునీల్ కి త్రివిక్రమ్ సినిమా అనగానే తన ఫ్రెండ్ తనకోసం ఏదో పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు అనుకుంటూ త్రివిక్రమ్ ను నమ్మి వెళ్లగా స్నేహితుడికి కేవలం ఒకటి రెండు నిమిషాల్లో కనిపించే పాత్రలను మాత్రమే ఇస్తున్నాడు గురూజీ. అరవింద సమేత అలా వైకుంఠపురము సినిమాలలో చాలా చిన్న రోల్, అది కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని రోల్ లో నటించాడు సునీల్. ఇక రీసెంట్ గా గుంటూరు కారంలోను సునీల్ ఇలా వచ్చి అలా మాయం అయ్యాడు. అది కూడా చాలా చిన్న రోల్ అది చూసాకే సునీల్ స్నేహితుడు అని నమ్మి మోసపోతున్నాడని ప్రేక్షకులు, ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం పట్ల సునీల్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -