God Father: గాడ్‌ఫాదర్‌లో ఆ సీన్‌లో మెగస్టార్‌ కాలు ఎత్తకపోవడానికి కారణం అదే!

God Father: ప్రస్తుతం ప్రతి సినిమా డబ్బింగ్‌ తీస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా అది ఏదో ఒక భాషలో రిలీజ్‌ అయిందే ఉంటుంది. గాడ్‌ ఫాదర్‌ టైటిల్‌తో దసరాకు చిరంజీవి మరోసారి తెరపైకి రానున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. వాస్తవానికి మలయాళం సినిమానే అయినా ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్‌ చేసి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేశారు. అప్పట్లోనే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.

మరి ఎందుకు రీమేక్‌ చేయాలనిపించిందో ఏమో తెలియదు కానీ కొణిదెల ప్రొడక్షన్‌ సంస్థ రంగంలోకి దిగి తెలుగు రీమేక్‌ హక్కులు కొనుక్కుని సినిమా ప్రకటించి పూర్తిచేసి దసరాకి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉండడంతో దాదాపు చాలామంది ఇప్పటికే చూసేశారు. అయితే ఇప్పుడు కచ్చితంగా మోహన్‌ లాల్‌ నటనకు చిరంజీవి నటనకు ట్యాలీ మొదలవుతోంది. ఇప్పటికే ఒక ట్రైలర్‌ వదిలారో లేదో అప్పుడే మోహన్‌ లాల్‌ ను చిరంజీవిని కంపేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ చేస్తున్నారు.

లూసిఫర్‌ సినిమాలో ఒక సీన్‌లో పోలీస్‌ అధికారిని గోడకు అదిమిపెట్టి కాలితో పీక నొక్క సీన్‌ ఉంటుంది. చేతులు రెండింటికి సంకెళ్లు వేసి ఉండటంతో మోహన్‌ లాల్‌ ఆ సీన్‌లో అలా నటించాల్సి వస్తుంది. అదే సీన్‌ను తెలుగులో మెగాస్టార్‌తో కూడా చేయించారు. కానీ మెగాస్టార్‌ పూర్తిగా కాలు ఎత్తలేని పరిస్థితుల్లో ఒక బల్ల వేసి బల్ల మీద సముద్రకనిని కూర్చోబెట్టి ఆయన పీక మీద కాలు పెట్టినట్టు చూపించారు.

ఇలా ఒక సీన్‌లో ఒక ఫ్రేమ్‌లో ఈ విధంగా కంపేరిజన్‌ చేస్తున్నారంటే కచ్చితంగా పూర్తి సినిమా విడుదలైన తర్వాత అసంఖ్యాక ట్రోల్స్‌ సినిమా మీద వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దానికి తోడు మలయాళ మాతృకలో మంజు వారియర్‌ సోదరుడు పాత్రలో లోవినో థామస్‌ కనిపిస్తారు. అయితే తెలుగులో మాత్రం అలాంటి పాత్ర ఉన్న జాడే ట్రైలర్‌ లో కనిపించలేదు. గతంలో ఆ పాత్రను తప్పించి తెలుగు వెర్షన్‌ రూపొందిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ట్రైలర్‌ ప్రకారం చూస్తే అది నిజమే అనుకోవాలి.

ఒక రకంగా సినిమాను మలుపు తిప్పే పాత్రని తప్పించి తెలుగులో ఎలా ప్లాన్‌ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ లాజిక్‌తో కనుక తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోతే ఆచార్యకు జరిగిన పరిస్థితి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కూడా భాగం కావడంతో సినిమాని హిందీలో రిలీజ్‌ చేస్తున్నారు. నయనతారకు ఉన్న క్రేజీతో మలయాళంలో కూడా రిలీజ్‌ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -