West Bengal: దేవుడా.. ఆ కూలీ అకౌంట్ లో ఏకంగా రూ.100 కోట్లు జమయ్యాయిగా!

West Bengal: ఒక్కొక్కసారి మనుషులకి అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. మెరుపు తీగలాగా ఇలా వచ్చి ఊరించి అలా వెళ్ళిపోతుంది. అలాంటి ఘటనే ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే రోజువారి వ్యవసాయ పనులకై కూలీకి వెళ్లే ఒక వ్యక్తి ఎకౌంట్లో ఒకేసారి 100 కోట్లు జమ అయ్యాయి.

రాత్రికి రాత్రే ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయిపోయాడు. అయితే సంతోషించాల్సింది పోయి తనని పోలీసులు ఎక్కడ జైల్లో వేస్తారో అని భయం పట్టుకుంది ఆ వ్యక్తికి. వెస్ట్ బెంగాల్ దేగంగాలోని వాసుదేవపూర్ కి చెందిన మహమ్మద్ నసీరుల్లా వ్యవసాయ కూలీ ఇతనికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

నసీరుల్లా సంపాదనతోనే ఆ కుటుంబం బ్రతుకీడుస్తుంది. అతనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది. అతని అకౌంట్లో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉండేవి అయితే ఆయన అకౌంట్లో ఇటీవల 100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆయనకు జంగిపూర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు.

 

మే 30లోగా ఈ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతో నసీరుల్లా భయభ్రాంతులకి గురయ్యాడు. అడుగు తన అకౌంట్లోకి ఎలా వచ్చిందో తెలియడంటూ తల పట్టుకుంటున్నాడు. ఇదే విషయాన్ని బ్యాంక్ అధికారులకి చెప్పగా వారు నసీరుల బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేశారు.

 

అయితే ఇంత పెద్ద నగదు ఎలా బదిలీ అయిందో విచారణ చేపట్టారు అధికారులు. ఇది బ్యాంక్ అధికారుల లోపమా లేకపోతే సాంకేతిక కారణాల వల్ల జరిగిన లోపమా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆ ఎకౌంట్లోకి డబ్బు ఎలా వచ్చి చేరింది అన్నది బ్యాంక్ అధికారులు ఇప్పటికి వచ్చి వివరణ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -