Viral: దేవుడా.. యూట్యూబ్ వ్యూస్ కోస్ం ఏకంగా ఇంతలా దిగజారాలా?

Viral: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చాలామంది సోషల్ మీడియా పై ఉన్న పిచ్చితో ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లైక్స్ కోసం చాలామంది ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది రిస్క్ స్టంట్ లు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అలా ఒక వ్యక్తి కూడా ఏకంగా యూట్యూబ్ కోసం విమానాన్ని కూల్చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2021 నవంబర్ 26న 29 ఏళ్ల ట్రెవర్ డేనియల్ జాకబ్ అనే వ్యక్తి తేలికపాటి విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. అతడికి పైలెట్ లైసెన్స్ ఉంది. విమానంలో కాలిఫోర్నియా లోని లాంపోక్ సిటీ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరాడు.

మామూత్ లేక్స్ కు వెళ్తున్నట్టు సమాచారం అందించాడు. విమానం టేకాఫ్ అయింది, 35 నిమిషాల ప్రయాణం సాగింది. లాస్ పాడ్రెస్ నేషనల్ ఫారెస్ట్ పై నుంచి విమానం ఎగురుతోంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే కమాండ్ కంట్రోల్ ను సంప్రదించాడు జాకబ్. వాళ్లు కొన్ని సూచనలు చేశారు, ఏం చేయాలో చెప్పారు. కానీ అవేవీ పనిచేయలేదు. ఇక ఆఖరి ప్రయత్నంలో భాగంగా విమానం నుంచి దూకేస్తున్నట్టు సమాచారం అందించాడు జాకబ్. ఆ వెంటనే దూకేశాడు. అలా ఆ తేలకపాటి విమానం పాడ్రెస్ అడవుల్లో కుప్పకూలింది. పారాచూట్ సహాయంతో కిందకు దిగిన జాకబ్ ను, స్థానిక రైతులు కాపాడారు.

 

జాకబ్ బాగా అలసిపోయాడు, దగ్గర్లోని చెరువు వద్దకు వెళ్లి నీళ్లు తాగాడు. ఈ దృశ్యాలన్నీ అతడు తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టాడు.
మరోవైపు జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దృష్టిపెట్టారు. లోతుగా విచారణ సాగిస్తే, వాళ్లకు విస్తుగొలిపే వాస్తవం బయటపడింది. కేవలం యూట్యూబ్ లో వ్యూస్, క్లిక్స్ కోసం జాకబ్ అలా విమానాన్ని కూల్చేశాడని, ఆ వీడియోల్ని తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టాడని తెలీంది. లైవ్ లో విమానం క్రాష్ అనగానే మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. తను ఆడిన నాటకం బయటపడ్డంతో జాకబ్ తప్పు ఒప్పుకున్నాడు. కేవలం వ్యూస్ కోసమే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు అబద్ధమాడి, కూలిపోయినట్టు చేశానని అంగీకరించాడు. ఈ కేసుపై తాజాగా తీర్పు వెలువడింది. కోర్టు అతడి పైలెట్ లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాదు, ఏకంగా 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -