YSRCP: ఏపీలో మార్పు మొదలైందిగా.. వైసీపీ అధికారంలోకి రాదని అధికారులు వరుస షాకులిస్తున్నారా?

YSRCP: ఏపీలో మార్పు మొదలైంది. అవును.. ఏపీ ఓటర్లలో ఎప్పుడో మార్పు మొదలైంది. కానీ.. ఇప్పుడు ఆ మార్పు అధికారుల్లో కూడా కనిపిస్తోంది. విశాఖలో లక్ష్మీ పార్వతి గవర్నర్ బంగ్లాలో మీడియా సమావేశం పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, అధికారులు ఇక్కడ వద్దు.. వేరే దగ్గర పెట్టుకోమని సూచించారు. అంతేకాదు.. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలో కూడా అంతే.. రాజకీయంగా ప్రెస్ మీట్లు పెట్టాలని అనుకుంటే వేరే దగ్గర పెట్టుకోవాలని దానికి గవర్నర్ బంగ్లా వాడుకోవద్దని అధికారులు తెగేసి చెప్పారట. దీంతో.. ఆయన గవర్నర్ బంగాల్ ఎదుట నిలబడి మాట్లాడారు తప్పా.. బంగ్లాలో మాత్రం ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు. అలా అని గతంలో ఎప్పుడూ గవర్నర్ బంగ్లాలో పెట్టలేదా? అంటే అమర్నాథ్ ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా..గవర్నర్ బంగ్లాలోనే పెట్టేవారు. మరి ఇప్పుడు ఎందుకు అధికారులు వద్దనన్నారు అనేదే చర్చనీయంశంగా మారింది. అక్కడే మార్పు మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధికారులు అధికార పార్టీ నేతలకు వస్తాసు పలకడం నెమ్మది నెమ్మదిగా మానేస్తున్నారట. పైగా ఎన్నికల సమయం కనుక అధికార పార్టీ నేతలకు దూరంగా ఉండటం మంచిదని అనుకుంటున్నారట. అమర్నాథ్ విషయంలో జరిగింది మాత్రమే బయటకు కనిపిస్తోంది కానీ.. అధికారులు చాలా వరకు వైసీపీ నేతల ఆదేశాలను పక్కన పెట్టేస్తున్నారట. దానికి ఓ కారణం ఉందట. ఇన్ని రోజులు అధికార పార్టీ నేతల అండ చూసుకొని కొంతమంది. వైసీపీ నేతల ప్రలోభాలకు గురై మరికొంత మంది చెలరేగిపోయేవారు. అధికార పార్టీ నేతలు సిట్ అంటే సిట్ అని.. స్టేండ్ అంటే స్టేండ్ అన్నట్టు ఉండేవారు. అధికార పార్టీ నేతలు వెనకుండి నడిపిస్తే.. తెర మీద వారు చేసిన అరచాకాలు ఇప్పుడు వారికి గుర్తు వస్తున్నాయట. అందుకే ఇప్పటికైనా వైసీపీ నేతలకు దూరంగా ఉంటే బెటర్ అనుకుంటున్నారట. అధికార ప్రజాపతినిధుల ఆదేశాలను వింటున్నారు కానీ.. పాటించడం లేదట.

చట్టబద్దంగా ఉన్నంత వరకూ పర్వాలేదు కానీ.. ఎవరైనా వైసీపీ నేత తమకు కొంచెం ఫేవర్ చేయాలని కోరితే.. సరేనని చెప్పి తప్పించుకుంటున్నారు కానీ.. వారి డ్యూటీ వారు చేసుకుపోతున్నారట. ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఎన్నికల దగ్గర పడుతున్నాయి కనుక అడ్డగోలు దోపిడీకి తెగబడతారని భయపడుతున్నారు. అదే జరిగితే రేపటి రోజు తాము సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నారట. అందుకే.. అధికార పార్టీ నేతలు ఏమైనా ఫైల్స్ పంపిస్తే పక్కన పడేస్తున్నారని టాక్. గత కొన్ని రోజుల్లోనే అధికారుల్లో ఈ మార్పు కనిపిస్తోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం కేసుల్లో ఇరుక్కున్న పోలీసులను.. అవినీతి ఆరోపణలు ఉన్న పోలీసులను వాడుకొని ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పోలీసులు ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వం చేతులు మారడం ఖాయంగా ఉందని.. తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని మదన పడుతున్నారు. అందుకే ఎన్నికల టైంలో అయిన ఉద్యోగం నిజాయితీగా చేస్తే కాస్త ప్రతిపక్షనేతలకు కోపం చల్లారుతుందని అధికారులు భావిస్తున్నారట. అందుకే అధికార పార్టీనేతలకు ఊడిగం చేయడం తగ్గించారని టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -