Chiranjeevi: 30 సంవత్సరాల క్రితం చిరంజీవి రేంజ్ ఏంటో మీకు తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగారు మంచి పోజిషన్లో ఉన్నప్పుడు ఈయనకు పోటీగా బాలకృష్ణ వెంకటేష్ కృష్ణ వంటి ఎంతోమంది హీరోలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చిరంజీవి మాత్రం అందరిని వెనక్కి నెట్టి స్టార్ హీరోగా కొనసాగారు.

 

ఈ విధంగా చిరంజీవి సినిమాలంటే అప్పట్లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది చిరంజీవి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండేది కాదు. ఇకపోతే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకు ఓ అభిమాని టికెట్ కొనుగోలు చేసిన ధరకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అప్పట్లో సినిమాకి 50 రూపాయలకు మించి ధర ఉంటే అది గగనమే అని చెప్పాలి అలాంటిది ఓ అభిమాని చిరంజీవి సినిమాకు ఏకంగా 800 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి సినిమా చూశారట 30 సంవత్సరాల క్రితం 800 రూపాయల టికెట్ అంటే మామూలు విషయం కాదు. మరి ఏ సినిమాకు ఆ స్థాయిలో టికెట్ కొనుగోలు చేశారు అనే విషయానికి వస్తే చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాని చూడటం కోసం అభిమాని ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టారని తెలిసి చిరంజీవి కూడా ఆశ్చర్యపోయారట.

 

అప్పట్లో 800 రూపాయలు అంటే ఇప్పుడు మనకు 80000 తో సమానమే అని చెప్పాలి ఈ రేంజ్ లో టికెట్ కొనుగోలు చేసి సినిమా చూడటం అంటే చిరంజీవి అంటే ఏ రేంజ్ లో అభిమానం ఉందో అర్థమవుతుంది. ఇక ఈ విషయానికి సంబంధించిన ఒక పేపర్ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది మెగాస్టార్ రేంజ్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -