Haryana: ఆ కారణంతో ప్రభుత్వ వైద్యుడికి కుర్చి ఇవ్వలేదంటా.. నిజమా..

Haryana:  టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతున్న నేటి కాలంలో ఇంకా కులవివక్ష కొనసాగుతూనే ఉంది. కులవివక్ష చూపరాదని ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా రోజూ ఏదో ఓ చోటు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అణగారిన వెనుకబడిన వర్గాల నుంచి ఎందరో అత్యున్నత పదవులు, రాజకీయలో అత్యంత ప్రజాదరణ పొందుతున్నారు. ఈ కుల వివక్ష సామాన్యులకే కాక పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారిన ప్రముఖులను, ప్రభుత్వ ఉద్యోగులను సైతం వెంటాడుతోంది. తాజాగా ఓ వైద్యుడు పై కులవివక్షత చూపించారు. ఆ అవమానాన్ని భరించలేక సదరు వైద్యుడు కన్నీటి పర్యతమమైన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వైద్యుడు అవమానంతో వెక్కి వెక్కి ఏడ్చిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బిహార్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి హర్యానాలోని భివానీ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ధర్మేంద్ర చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. భివానీ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యుడైన తనకు కూర్చునేందుకు స్థలం ఇవ్వడం లేదని వాపోవాడు. అయితే వివిధ రోగాలతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే వారిని చూడాలన్నా తనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపాడు. ఇదంతా కులవివక్షతోనే చేస్తున్నారని వైద్యుడు ఆరోపించాడు. ఆస్పత్రిలో కూర్చునేందుకు ధర్మేంద్రకు కుర్చీ ఇ్వవడం లేదని, ఆయన కులాన్ని చూసి వారు ఇలా చేస్తున్నారు. అందుకే మనోవేదన గురై ఒక్కసారిగా ఏడ్చేశారని వీడియో తీసిన వ్యక్తి తెలిపారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులకు వైద్యుడు ధర్మేంద్ర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, కులవివక్ష కారణంగానే వైద్యుడిని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనేది మాత్రం నిజమా.. అబద్దామా స్పష్టత లేదు. కాగా.. ధరేంద్ర చేసిన ఆరోపణలపై భివానీ సివిల్‌ ఆస్పత్రి వైద్యుడు ఎడ్విన్‌ రంగా భిన్నంగా స్పందించారు. ధర్మేంద్ర సిబ్బందితో, తోటి రోగులతో అనుచితంగా ప్రవర్తించారని ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లి సిబ్బంది పట్ల తప్పుగా ప్రవర్తిస్తూ వారిని తిట్టాడని ఆరోపించారు. ఇక మరో వైద్యుడు మనీశ్‌ ధర్మేంద్రపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -