Haryana: ఆడపిల్లల తల్లీదండ్రులకు అదిరిపోయే శుభవార్త ఇదే.. ఏం జరిగిందంటే?

Haryana: కాలం మారుతున్న ఇప్పటికీ ఆడపిల్లలంటే ఎంతో మంది తల్లిదండ్రులు భారంగానే భావిస్తున్నారు. ఇలా ఆడపిల్లలను భారంగా భావించడంతో దేశంలో ఆడపిల్లల జనన రేటు పూర్తిగా తగ్గిపోయింది. ఈ విధంగా ఆడపిల్లల జనన రేటును పెంచడం కోసం పల రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిలు పుట్టిన తర్వాత పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చింది అయితే తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా అమ్మాయిలు కోసం మరొక పథకాన్ని తీసుకువచ్చింది.

హర్యానాలో అమ్మాయిల జనన రేటు పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడ అమ్మాయిల జనన రేటును పెంచడం కోసం హర్యానా లాడ్లీ యోజన అనే పథకం ప్రారంభించింది. దీని కింద రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ పథకానికి 2005 ఆగస్టు 30 తర్వాత పుట్టినవారందరిని అర్హులుగా ప్రకటించారు. అయితే ఈ పథకానికి అర్హులైనటువంటి వారందరికీ ప్రతి 5000 రూపాయలను వారి ఖాతాలో జమ చేయనున్నారు.

 

ఈ పథకానికి అర్హత పొందడానికి వారు హర్యాన రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు కుల దృవీకరణ పత్రం జనన ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించి ఉండకూడదు. కూతురికి ఇచ్చే ఈ సహాయాన్ని కిసాన్ పత్ర ద్వారా సహాయం చేయనున్నారు.

 

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు శాశ్వతంగా హర్యాన నివాసి అయి ఉండాలి అలాగే ఇద్దరు అమ్మాయిలు అయితేనే ఈ పథకానికి అర్హులు. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు మీ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి లేదా బీమా కార్యాలయం నుండి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -