Taraka Ratna: తారకరత్న భార్యకు ఆ పదవి ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారా?

Taraka Ratna: నందమూరి తారకరత్న మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచింది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మాత్రం ఇది ఎప్పటికీ తీరని విషాదం అని చెప్పాలి. 39 ఏళ్ళ వయసులోనే తారకరత్న మరణించడం అనేది అందరి హృదయాలను కంటతడిలో పెట్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో తారకరత్న నందమూరి వారసుడుగా అడుగుపెట్టగా.. కొన్ని సినిమాలలో మాత్రమే చేశాడు. కానీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు.

ఈయన పెళ్లి సమయంలో తన కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని విరాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని.. ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకున్నాడు తారకరత్న. అయితే ఈ పెళ్లి నందమూరి కుటుంబంకు ఎవరికి ఇష్టం లేక పోయింది. ఇక తారక రత్న అప్పటినుంచి తన కుటుంబం కి దూరంగా ఉంటూ తన భార్య పిల్లలను చూసుకుంటూ గడిపాడు.

 

ఆ మధ్యనే నందమూరి కుటుంబంతో మళ్లీ మాటలు కలవడంతో రాకపోకలు మొదలయ్యాయి. ఇక సినిమాలకు దూరంగా తారకరత్న రాజకీయాల వైపు అడుగు పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. కానీ రాజకీయపరంగా కూడా పూర్తి సంతృప్తి కాకముందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

 

గత నెల 18న మరణించారు. ఆ సమయంలో తన భార్య అలేఖ్య రెడ్డి ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఇక తన ముగ్గురు పిల్లల్ని చూసుకొని బాగా కుమిలిపోయింది. అప్పటినుంచి ఎంతమంది ఉన్నా కూడా భర్తలేని లోటు తనను మరింత బాధ పెడుతూనే ఉంది. ఇప్పటికే తారకరత్న భార్య పిల్లల బాధ్యత బాలయ్య చూసుకుంటానని మాట ఇచ్చాడు. రీసెంట్గా ఎన్టీఆర్ కూడా రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే తాజాగా చంద్రబాబు కూడా అలేఖ్య రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

 

అదేంటంటే.. గుడివాడ నుంచి టీడీపీ తరపున అలేఖ్య పోటీ చేయనున్నట్లు తెలిసింది. అలేఖ్య గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే హోం మినిష్టర్ పదవి ఇస్తానని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయం తెలియడంతో తారకరత్న అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -