CM Revanth Reddy: హైదరాబాద్ ఐటీ రంగానికి పునాది చంద్రబాబే.. తెలంగాణ సీఎం కామెంట్లు వినిపిస్తున్నాయా?

CM Revanth Reddy: గత ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాలను, మంచి పథకాలను అమలు చేయాలి. పరిపాలన దక్షకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఇది. చాలా మంది వాటిని అలాగే అమలు చేస్తారు కూడా. కానీ, ఆ మంచి పని క్రెడిట్ మాత్రం ఎవరికి వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలుగు రాష్ట్రాలో అభివృద్ధి, సంక్షేమంలో ఇద్దరి నాయకుల పాత్ర, ప్రభావం బలంగా ఉంటుంది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు. ఈ రోజు హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందంటే కారణం చంద్రబాబు. ఐటీ పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్లారు. ప్రపంచస్థాయి కంపెనీలను ఆహ్వానించారు. అప్పటికే ఐటీ రంగంలో బెంగళూరు అభివృద్ధి చెందింది.

అక్కడి కాకుండా హైదరాబాద్ కు కంపెనీలు వచ్చేలా చేశారు. బిల్ క్లింటన్‌ను హైదరాబాద్ కు రప్పించారు. ఈ విషయాలను ఎవరూ కాదనలేరు. గతంలో చాలా సార్లు మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రైవేట్ కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చాలా సార్లు చెప్పారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయితే, ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. చంద్రబాబునాయుడు లేకపోతే హైదరాబాద్ లేదు అని చెప్పారు. చంద్రబాబు విజనరీతోనే హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు వచ్చిందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబుతో రాజకీయంగా విభేదించారే కానీ.. ఆయన నిర్ణయాలను వ్యతిరేకించలేదు.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకొని వెళ్లారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా.. రుచించని వారు ఒక్క వైసీపీ నేతలే. చంద్రబాబును ఎవరైనా పొగిడితే.. వారిపై దాడులు, దుర్భాషలు. అంతేకాదు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా వాటిపై సమీక్షలు జరిపి ఒప్పందాలను రద్దు చేసుకుంటారు.  జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారు. దీంతో.. పారిశ్రామిక వేత్తలు ఎవరూ ఏపీ వైపు చూడటం లేదు. ఎందుకంటే.. రేపటి రోజున తమ ఒప్పందాలు కూడా రద్దు అయితే ఏంటీ పరిస్థితి అనే మీమాంసలో పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. అందుకే ఏపీ వైపు ఎవరూ చూడటం లేదు. గత ప్రభుత్వాలు తప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. గత ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలి కానీ.. ఆ ఒప్పందాలను రద్దు చేసుకో కూడదు. కానీ, జగన్ ఒప్పందాలనే రద్దు చేసుకున్నారు.

అంతేకాదు.. చంద్రబాబును ఎవరైన పొగిడితే జగన్ కు నచ్చదు. అసలు ఏ విషయంలో కూడా చంద్రబాబు పేరు వినిపించకూడదు. అందుకే అమరావతికి ఆనవాళ్లు లేకుండా చేయాలి అనుకున్నారు. హైదరాబాద్ అంటే కచ్చితంగా చంద్రబాబు పేరు వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలు ఈ భూమి మీద ఉన్నంత వరకూ చంద్రబాబు పేరు వినిపిస్తుంది. అమరావతి విషయంలో అలా జరగకూడదు అని చంద్రబాబు కలల రాజధాని ఉండకూడదని జగన్ మూడు రాజధానుల పేరుతో కొత్తనాటకానికి తెరలేపారు. జగన్ కు ఉన్న ఆ ఈగో వలన ఏపీకి రాజధాని లేకుండా పోయింది. తన ప్రత్యర్థులకు మంచి పేరు రాకూడదు అనుకోవడంలో ఉన్నంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. దాని ఫలితమే ఏపీకి రాజధాని లేకుండా పోవడం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -