TDP Election Campaign: రాష్ట్రంలో ఎటు చూసినా పసుపు ప్రచారమే.. గెలుపుపై ఆశలు లేక వైసీపీ సైలెన్స్!

TDP Election Campaign: ఎన్నికలకు మరొక 20 రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల వేగవంతం అయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా పసుపు ప్రచారం ఏ కనిపిస్తుంది. తప్ప నీలిరంగు ప్రచార కార్యక్రమాలు ఎక్కడ కనపడలేదనే చెప్పాలి. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రజాగళం అంటూ రోజుకు రెండు జిల్లాలలో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించగా మరోవైపు లోకేష్ మంగళగిరి ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు ఇక కూటమి తరపున పవన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడు కలిసి కూడా రోడ్డు షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ జ్వరం కూడా లెక్క చేయకుండా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక బాలకృష్ణ సైతం రాయలసీమలో భారీ స్థాయిలో ప్రచారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు తెలుగుదేశం నేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయడమే కాకుండా నామినేషన్లను కూడా భారీ స్థాయిలో వేశారు. మరోవైపు వైసీపీ మాత్రం ప్రచారంలో పూర్తిగా వెనుకబడిపోయిందని తెలుస్తుంది. వైయస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలలో నిర్వహించలేదు. ఇక డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఎవరూ కూడా ప్రచార కార్యక్రమాలకు రాలేదు.

సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తప్ప మరే ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించలేదు అయితే ఈ బస్సు యాత్ర కూడా రోజు మార్చి రోజు చేస్తూ అదే బస్సు యాత్రను ప్రతిరోజు చేస్తున్నట్లు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రచార కార్యక్రమాలలో వైసిపి వెనుకబడిపోవడంతో గెలుపుపై కూడా ఆశలు వదులుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పసుపు మయం అయిందని చెప్పాలి ఇలా ప్రచారం కార్యక్రమాలను చూస్తుంటే కూటమి గెలుపు ఖాయమైందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -