Government Jobs: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.. భారీ వేతనంతో జాబ్స్!

Government Jobs: దేశవ్యాప్తంగా రోజురోజుకీ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలు ఎన్ని రకాల ప్రకటనలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రావడం లేదు. పది పోస్టులకు వందమంది అప్లై చేస్తుండగా 100 పోస్టులకు 200 మంది అప్లై చేస్తున్నారు. ఇలా ప్రస్తుతరోజుల్లో ఉద్యోగం రావడం అన్నది చాలా కష్టంగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కటి శుభవార్తను తెలిపింది.. తెలంగాణలోని సంక్షేమ గురుకులల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏకంగా 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. ఇందులో 3,012 అంటే దాదాపు 75 శాతం ఉద్యోగాలు మహిళలకే దక్కనున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోగలరు. తొలుత 4,020 టీజీటీ పోస్టులు ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, దివ్యాంగుల సంక్షేమశాఖలోని 14 పోస్టులకు సర్వీసు నిబంధనలు రాకపోవడంతో తాజా ప్రకటనలో వెల్లడించలేదు. ఇకపోతే మొత్తం ఖాళీలు వాటి సొసైటీ వివరాల విషయానికొస్తే.. మొత్తం ఖాళీలు 4,006. అందులో

సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు – 728
ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు – 218
బీసీ గురుకుల పాఠశాలలు – 2379
మైనార్టీ గురుకులాలు – 594
రెసిడెన్షియల్ పాఠశాలలు – 87

 

కాగా విద్యార్హతల విషయానికి వస్తే.. జనరల్‌ అభ్యర్థులకు బీఏ, బీకాం డిగ్రీలో 50శాతం మార్కులు ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ, బీఈడీ, బీఎస్‌సీ బీఈడీ చదివి ఉండాలి. డిగ్రీలో ఆప్షనల్‌ సబ్జెక్టుగా సంబంధిత లాంగ్వేజీ లేదా ఓరియంటల్‌ లాంగ్వేజీలో డిగ్రీ లేదా లిటరేచర్‌లో డిగ్రీ లేదా సంబంధిత భాషలో పీజీ డిగ్రీ 50 శాతం మార్కులతో పాటు లాంగ్వేజి పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేదా బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలి. వీటితో పాటుగా పేపర్‌-2లో టీఎస్ టెట్‌,ఏపీటెట్‌, టెట్‌ లో పాసై ఉండాలి. అదే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీ కోర్సుల్లో 45 శాతం మార్కులు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ.1,200, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా వయోసడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: సంబంధిత పోస్టులను అనుసరించి రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు వేతనంగా చెల్లించనున్నారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్షను మూడు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1లో 100 మార్కులకు జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఆంగ్లభాష పరిజ్ఞానంపై ప్రశ్నలుంటాయి. అదే పేపర్‌-2 విషయానికొస్తే 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టులో బోధన సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు.ఇక పేపర్‌-3 విషయానికొస్తే 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలుంటాయి.

రాత పరీక్షల తేదీ: ఆగస్టు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28.04.2023

దరఖాస్తులకు చివరి తేదీ: 27.05.2023

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -