Contract employees: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన తెలంగాణ సర్కార్.. ఏమైందంటే?

Contract employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు వరుసగా తీపి కబురు చెబుతుంది. గత రెండు రోజుల క్రితం ఉన్నత విద్య శాఖ లోకాంట్రాక్టర్ గా పని చేస్తున్నటువంటి టీచర్లకు రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయడంతో టీచర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

తాజాగా కేసీఆర్ మరో శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందజేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 1331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు చేతులమీదుగా ఆయా విభాగాల యూనియన్ వారికి ఆయన స్వయంగా ఉత్తర్వుపత్రులను అందజేశారు.

 

నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ తన ఛాంబర్ లో వైద్య శాఖలో ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ పోస్టులను క్రమబద్ధీకరిస్తూ సంతకం చేశారు.
మొత్తం 40 విభాగాల్లో, 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏప్రిల్ 30వ తేదీన ఉత్త‌ర్వులు విడుద‌లైన విషయం తెలిసిందే. తాజాగా వైద్యారోగ్య శాఖ‌లో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

ఇల వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులందరిని ఇలా రెగ్యులర్ చేయడంతో ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -