Heroines: ఈ హీరోయిన్ల చదువు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Heroines: స్టార్ హీరోయిన్లకి ఉండే కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఉన్న తక్కువ సమయంలోనే వారు మంచి పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇటీవల ఈ ధోరణి కొద్దిగా మారింది. హీరోయిన్లు ఎక్కువ కాలం స్టార్ లుగా కొనసాగుతున్నారు. దీంతో వారి గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది . ఈ ముద్దుగుమ్మలు ఎక్కడ నుంచి వచ్చారు. ఏం చదువుకున్నారు అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
ముద్దు గుమ్మల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 
మన టాలీవుడ్ లో ఎంతో మంది పెద్ద స్టార్స్ ఉన్నారు హీరోయిన్స్ లో. వారిలో కొంతమంది బాగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. కొంత మంది అందగత్తెలు డిగ్రీ చేస్తే కొంతమంది పీజీ కూడా చేసి ఔరా అనిపించారు. అలా బాగా చదువుకున్న ముద్దుగుమ్మల మీద ఒక లుక్ వేద్దాం రండి.
సమంత,తమన్నా,కాజల్,అనుష్క,నయనతార,రష్మిక,కీర్తి సురేష్,సాయి పల్లవి లాంటి ఎంతో మంది ముద్దుగుమ్మలు మన దగ్గర సందడి చేశారు చేస్తూనే ఉన్నారు. బాగా చదువుకున్న హీరోయిన్ ల లిస్ట్ తీయాల్సి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సాయి పల్లవి గురించి. ఈ టాలెంటెడ్ హీరోయిన్ డిగ్రీ తరువాత ఎంబీబీస్ కూడా పూర్తిచేసారు. లాక్ డౌన్ సమయంలో సాయి పల్లవి డాక్టర్ పట్టా పొందినట్టు సమాచారం.
కమల్ హాసన్ తనయ శృతి హాసన్ చదువులో దిట్ట. ఇండస్ట్రీ కి రావడానికి ముందు ఆవిడ బీఎస్సీ పొందారు. కన్నడ కస్తూరి రష్మిక మందాన సైకాలజీ,జర్నలిజం,ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పట్టా పొందినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్(బిఎస్పీ),లేడీ సూపర్ స్టార్ నయనతార( బీఏ ఇంగ్లీష్ లిటరేచర్),బుట్ట బొమ్మ పూజా హెగ్డే( కామర్స్ పీజీ),మహానటి కీర్తి సురేష్( ఫ్యాషన్ డిజైనింగ్),తమన్నా( బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్),అనుష్క శెట్టి( బీసీఏ),కాజల్( మాస్ మీడియా లో బీఏ),సమంత(బి. కామ్)

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -