Heros: ఈ స్టార్స్ కూతుళ్లు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Heros: సినిమా హీరోలంటే అభిమానులకు అమితాసక్తి. వారు నిత్యం ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, వారి ఫ్యామిలీ సంగతులేంటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే సినిమాల అప్‌డేట్‌ విషయంలో వస్తున్న వార్తలు, వారి గురించి, వారి ఫ్యామిలీ గురించిన గాసిప్స్‌ ఇతర ఇంట్రస్టింగ్‌ విషయాలను, నెట్టింట వైరల్‌ అవుతున్న అంశాలను ఎప్పటికప్పుడు ఓ కన్నేస్తూ ఉంటారు.

అభిమాన హీరోలపై చాలా మంది అనేక రకాలుగా అభిమానం చాటుకుంటూ ఉంటారు. ఇక తమిళ ఇండస్ట్రీలోని హీరోలకు ఆ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమ ఫేవరెట్‌ హీరోల గురించిన అనేక అంశాలను తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. ఇక కోలీవుడ్‌ స్టార్‌ హీరోల కుమార్తెల విషయానికి వస్తే.. దాదాపు అందరూ ఒకే వయసున్న అజిత్‌, సూర్య, విజయ్‌ల కూతుళ్ల గురించి, వారు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాలని చాలా మంది వార్తలను వెతుకుతున్నారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి స్టార్‌ హీరో సూర్య. హీరోయిన్‌ జ్యోతికను ప్రేమించి పెళ్లాడాడు సూర్య. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. సూర్య కుమార్తె దియా గురించి చాలా మందికి తెలిసిందే. దియా ఈ ఏడాదే పదో తరగతి పూర్తి చేసి కాలేజీలో చదువు మొదలు పెట్టింది. మంచి మార్కులతో టెన్త్‌ పూర్తి చేయడంతో సూర్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. దియా వయసు 17 ఏళ్లు. అచ్చం జ్యోతికలా అందంగా ఉందంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

ఆటల్లో మేటిగా అజిత్‌ కుమార్తె..
ఇక మరో హీరో అజిత్‌కు హీరోయిన్‌ శాలినితో పెళ్లయింది. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. పాప పేరు అనౌష్క కుమార్‌. చాలా అందంగా, చలాకీగా ఉంటూ ఆటల్లో మేటిగా రాణిస్తోంది. బ్యాడ్మింటన్‌లో రాణించిన అనౌష్క కుమార్‌ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం 8వ క్లాస్‌ చదువుతోంది. మరోవైపు దలపతి విజయ్‌కి సాష అనే కుమార్తె ఉంది. ఆ అమ్మాయిని విజయ్‌ కెనడాలో చదివిస్తున్నారు. పై చదువులు అక్కడే అభ్యసిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -