Hyper Adi: హైపర్ ఆది పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనా.. ఏం జరిగిందంటే?

Hyper Adi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక హైపర్ ఆది వేసే పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై కూడా వరుసగా పంచులు వేస్తూ కడుపుబ్బనవిస్తూ ఉంటాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు హైపర్ ఆది హద్దులు దాటి మరి సెటైర్స్ వేస్తుంటాడు. చాలామంది హైపర్ ఆది స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో హైపర్ ఆది చేసే చాలా స్కిట్ లలో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులే ఉంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పంచులు మరింత శృతి మీరాయి. ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలోనే హైపర్ ఆది బాగా హైలైట్ అవుతున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది ఒకవైపు జబర్దస్త్, మరోవైపు పాలిటిక్స్, మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈవెంట్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హైపర్ ఆదికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఓ ఫిమేల్ యాంకర్ తో హైపర్ ఆదికి పరిచయం ఏర్పడిందట. ఆమె ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకునాడు ఆది.

 

ఈ క్రమంలో ఆమెతో పరిచయం మరింత బలపడిందని తర్వాత వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు కూడా జరుగుతోంది. ఆ యాంకర్ వాళ్ళ అక్క కూడా మరో యాంకర్ కావడం విశేషం. దీంతో ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్న హైపర్ ఆది ఒక టాప్ సెలబ్రిటీనే పెళ్లి చేసుకుంటాడు అనుకున్న అభిమానులకు యూట్యూబ్ ఛానల్ యాంకర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త తెలియడంతో షాక్ అవుతున్నారు. దాంతో అభిమానులు ఆ యాంకర్ ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -