Hyper Aadi: హైపర్ ఆది భార్య సూపర్ గా ఉందిగా.. సరైన జోడీ దొరికిందంటూ?

Hyper Aadi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులర్ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. హైపర్ ఆది ఎక్కడ ఉంటే అక్కడ పంచుల వర్షం అని చెప్పవచ్చు. ఏ షోకి వెళ్లిన అక్కడ షోలో జడ్జి నుంచి యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై తనదైన శైలిలో పంచులు వేసి ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఉన్న టాప్ కమెడియన్ లో ఒకరిగా దూసుకుపోతున్నాడు హైపర్ ఆది.

అలాగే బుల్లితెరపై ఉన్న కమెడియన్లలో ఎక్కువగా పారితోషకం అందుకుంటున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఒకవైపు బుల్లితెర పై నటిస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, లతో పాటు పండగ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు వేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు.

 

చాలామంది నెటిజన్స్ హైపర్ ఆది స్కిట్లో మాట్లాడే మాటల్లో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్ లే ఎక్కువగా ఉంటున్నాయి అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఇప్పటికేం గతంలో చాలాసార్లు హైపర్ ఆదికి కాబోయే భార్య ఈమెనే, హైపర్ ఆది భార్య ఈమె? ఎంత అందంగా ఉందో?ఇలా అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి పైకి ఒక తెల్లటి అమ్మాయిని పిలుచుకుని వచ్చి ఈమెనే నా భార్య అని అందరికీ పరిచయం చేశాడు ఏప్రిల్ 2వ తారీఖుకుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

 

ఈ ప్రోమోలో ఆది తన భార్యను పరిచయం చేశాడు. ఒక విదేశీ అమ్మాయి పద్ధతిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి, మస్క్, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆదికి హగ్ ఇచ్చింది. అప్పుడు హైపర్ ఆది ఆమెను మాస్క్ తీయమని చెప్పగా నో అని ఆన్సర్ ఇచ్చింది. వాళ్ల కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా మాస్క్ తీయవే నీ మొఖం ఎవరు నేనింత వరకు చూడలేదు అని అనడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -