Vastu: ఇంట్లో అన్ని ముఖద్వారాలు ఉంటే గండం తప్పదు?

Vastu: మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాలకు సమస్యలకు మన ఇంటి వాస్తు కూడా ఒక రకంగా కారణం అని చెప్పవచ్చు. మనం నివసించే ఇల్లు వాస్తు ప్రకారంగా ఉంటే మనం అనుకున్న పనులు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. అందుకే ఇంటి పునాది విషయం నుంచి ఇంట్లో వస్తువులు అమరికా విషయం వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు విషయాలను పాటించాలని చెబుతూ ఉంటారు నిపుణులు. కాగా వాస్తు విషయాలలో ద్వారాల వాస్తు కూడా తప్పనిసరి. మామూలుగా మనం ఇంట్లో వద్దు ముఖద్వారాలు కిటికీలు సరి సంఖ్యలో ఉండాలని చెబుతూ ఉంటారు. బేసి సంఖ్యలో త్వరలో కిటికీలు ఉండడం అంత మంచిది కాదని చెబుతూ ఉంటారు.

అలా అని సరి సంఖ్య చివరిలో సున్నా రావడం కూడా మంచిది కాదు. మరి ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రెండు ద్వారాలు ఉంటే చాలా శ్రేష్టమైనది. ఈ ఇంట్లో నివాసం ఉండేవారు అభివృద్ధి చెందుతారు. మూడు ద్వారాలు ఉంటే తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో గొడవలు చాలవన్నట్టు కొత్త శత్రువులు పెరుగుతూ ఉంటారు. నాలుగు ద్వారాలు ఉంటే ఆ ఇంట్లో ఉండేవారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఇక
ఐదు ద్వారాలు ఉంటే నిత్యం అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరు ద్వారాలు ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి సంతాన వృద్ధి, ఐశ్వర్యం ఉంటుంది. ఏడు ద్వారాలు ఉంటే ఈ ఇంట్లో నివాసం ఉండేవారిని అపాయాలు వెతుక్కుంటూ వస్తాయి.

ఎనిమిది ద్వారాలు ఉంటే ఆ ఇంటివారికి పట్టిందల్లా బంగారమే. ఐశ్వర్యం, సౌభాగ్యంతో తులతూగుతారు. తొమ్మిది ద్వారాలు ఉంటే తరచూ రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే పది ద్వారాలు ఉంటే ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉంది. పదకొండు ద్వారాలు ఉంటే తరచూ ఇంట్లో అష్టకష్టాలు అనుభవించక తప్పదు. ఇక పన్నెండు ద్వారాలు ఉంటే ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిని, కీర్తిని కలిగిస్తుంది. పదమూడు ద్వారాలు ఉంటే మరణ ప్రమాదం, ఎడతెరిపి లేని కష్టాలు అనుభవిస్తారు. ఇక పద్నాలుగు ద్వారాలు ఉంటే ధన సంపద, కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది. పదిహేను ద్వారాలు ఉంటే ఎన్నో కష్టాలు, బాధలు, అశాంతి, అధిక ఖర్చులు ఉంటాయి. పదహారు ద్వారాలు ఉంటే ఏ పని తలపెట్టినా లాభం, అధికార యోగం. వాస్తురీత్యా సూచించిన గుమ్మాల సంఖ్యం సరిగ్గా ఉన్నట్టైతే ఆ ఇంట్లో నివశించే వారు ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -