Vastu Tips: ఇంట్లో ఈ 7 మొక్కలు ఉంటే ఎంతో మంచిదా.. వాస్తు ప్రకారం అనుకూలంగా జరుగుతుందా?

Vastu Tips:  మన చుట్టూ పచ్చని మొక్కలు ఉంటే మనసుకి కళ్ళకి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేటి అపార్ట్మెంట్ ప్రపంచంలో ఆరుబయట మొక్కలు పెంచడం కుదరదు కాబట్టి అందరూ ఇండోర్ ప్లాంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం వలన వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పెంచుకునే మొక్కల పెంపకం ద్వారా మీ దశ మారుతుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గరిక.. గరికని ఇంట్లో పెంచుకొని రోజు నీరు పోసి దాని ఆకులని వినాయకుడికి సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలగడంతో పాటు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకుంటారు. అలాగే మనీ ప్లాంట్ కూడా డబ్బుని బాగా ఆకర్షిస్తుంది. కాకుంటే దీని కొమ్మలు నేలని తాకకూడదు. ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. అలాగే వెదురు మొక్కని ఇంట్లో పెంచడం కూడా చాలా మంచిది.

ఈ అదృష్ట వెదురు గుత్తిలో బేసి సంఖ్యలో మొక్కలు ఉంచితే మరీ మంచిది. మూడు కాండాలు దీర్ఘాయువుని, ఐదు కాండాలు సంపదని, ఏడుకాండాలు ఆరోగ్యాన్ని, 9కాండాలు అదృష్టాన్ని సూచిస్తాయి. అలాగే స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచడం వలన ఆనందము, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో ఈ మొక్క చాలా పవిత్రమైనది. అలాగే ఆర్కిడ్లు ఇంట్లో పెంచుకోవటం వలన ప్రేమ, అదృష్టాన్ని అందించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఈ మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తాయి. రాత్రివేళ మంచి నిద్ర పొందటానికి ఆర్కిడ్లు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే తులసి చాలామంది ఇళ్లల్లో పెంచుకునే పవిత్రమైన మొక్క దీనిని ఇంట్లో పెంచుకోవడం వలన మంచి ఆరోగ్యం, అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ మొక్కని ఈశాన్య, ఉత్తర, తూర్పు, దిశలో ఉంచాలి . అలాగే రబ్బరు మొక్కని ఇంట్లో పెంచడం వలన అదృష్టము, శ్రేయస్సు, సంపద కలుగుతాయి. అలాగే జాడే మొక్క కూడా వాస్తు ప్రకారం ఇంటి గుమ్మంలో పెంచుకుంటే విజయాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -