Tablets: ఆ సామర్థ్యం కొరకు మందులు వాడితే నాశనమే.. ఏం జరిగిందంటే?

Tablets: షుగుర్, బీపీ, థైరాయిడ్ లాగానే సెక్స్ కూడా ఓ వ్యాధిగా, సమస్యగా మారిపోయింది. నానాటికి పెరుగుతున్న కాలుష్యం, పని ఒత్తిడి, తినే ఆహారపు అలావాట్లలో మార్పుల వల్ల సెక్స్ సామర్థ్యంగా గణనీయంగా తగ్గిపోతోందనే నివేదికలు కోకొల్లలు.
అయితే ఈ సమస్యను అధికమించటానికి చాలా మంది సొంత ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. ఏదో ఒక సైట్ ని ఇంటర్నెట్ లో వెదకటం, దాని ద్వారా మందులు తెచ్చుకోవటం జరగుతుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు.

సెక్స్ కోరికలు,లైంగిక సామర్థ్యం పెంచేందుకు మందులు తీసుకోవడం వల్ల శ్రీలంకలో మరణాలు బాగా పెరుగుతున్నాయని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. కొంత కాలంగా లైంగిక సామర్థ్యం పెంచే మందుల వల్ల చనిపోయే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిసింది. డాక్టర్ల సలహా తీసుకోకుండా మందులు వాడటం, నాణ్యత తక్కువగా ఉన్న వాటిని కొనుగోలు చేయడం, సరైన మోతాదులో మందు వేసుకోక పోవడం వంటివి ఇందుకు కారణాలుగా డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చాలా మందిలో లైగింక విజ్ఞానం లేదు. దాన్ని జీవితంలో ఒక పార్టుగా చూసిన, దాని వల్ల సమస్యలు వచ్చినప్పుడు అందుకు తగ్గ డాక్టర్ను కలిసేందుకు విముఖత చూపుతారు. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే సెక్స్ అనేది ఒక నేరంగా చూస్తున్నారనేది బహిరంగ రహస్యం.

చాలా మంది టీవీ లేదా మెుబైల్ లో చూసింది నిజమని భావిస్తుంటారు. ముఖ్యంగా పోర్న్‌ వీడియోలలో చూపించినట్లుగా ఎక్కువ సేపు సెక్స్ చేయాలంటే పురుషాంగం పొడవుగా ఉండాలని భావిస్తారు.కానీ ఇది అబద్ధమని చాలా మందికి తెలియదు. పొడవైన పురుషాంగం ఉన్న వారు మాత్రమే సెక్స్‌లో మహిళలను సంతృప్తి పరుస్తారనేది పూర్తిగా తప్పు. వైద్యుడి సలహా లేనిది ఎటువంటి మందులు వాడకూదని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -