Relationship: గర్భం రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసా?

Relationship: ప్రస్తుత రోజుల్లో చాలామంది పెళ్లి అయిన తర్వాత లైఫ్ లో సెటిల్ అవ్వాలని పిల్లలను అప్పుడే వద్దనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది పెళ్లయిన తర్వాత వెంటనే పిల్లలు కలగాలని కోరుకుంటూ కుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది గర్భం తొందరగా అవసరం లేదు అనుకున్న వారు పొరపాటున గర్భం వస్తుందేమో అన్న భయంతో గర్భనిరోధక టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ టాబ్లెట్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇలా టాబ్లెట్స్ వాడే వాడితో పోల్చుకుంటే సాధారణ మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది.

అయితే కొందరు మహిళలు గర్భం రాకుండా ఉండడం కోసం కండోమ్స్ వంటివి ఉపయోగిస్తుండగా మరికొందరు మాత్రం ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం మంచిదే కానీ మరి కొంతమంది అవసరానికి మించి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా కూడా మితిమీరి ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవు అని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. ఈ గర్భనిరోధక మాత్రలను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో పూర్తిగా పిల్లలు పుట్టే అవకాశం లేకుండాపోయే ప్రమాదం కూడా ఉంది.

 

అలాగే గుండె సంబంధిత సమస్యకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల విపరీతంగా పెరుగుతారు. అవసరానికి మించి ఎక్కువగా ఆకలి వేయడం వల్ల ఎక్కువగా తింటారు. కాబట్టి గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు ఆహారశైలి పై ఒక కన్నేసి ఉంచడం మంచిది. గర్భనిరోధకమాత్రలు వాడితే పుట్టబోయే బిడ్డలో అవ లక్షణాలు తలెత్తుతాయని చెబుతూ ఉంటారు కానీ అది పూర్తిగా అబద్దం. గర్భం దాల్చిన తొలినాళ్లలో పొరపాటున ఆ టాబ్లెట్స్ వేసుకున్న కూడా పుట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ప్రభావం పడదు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -