Tollywood: తల తెగితే సినిమా హిట్టవుతోందిగా.. టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్ ఇదే!

Tollywood: ఒకానొక సమయంలో తెలుగు సినిమాలు అంటేనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. సుమోలు గాలిలోకి లేయడం, పెద్ద ఎత్తున బాంబుదాడులు వంటి సన్నివేశాలను పెట్టేవారు అయితే గత కొద్దిరోజులుగా ఇలాంటి హింసాత్మక సన్నివేశాలు లేకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం సినిమాలలో తిరిగి ఇలాంటి హింసాత్మక సన్నివేశాలను పెడుతున్నారు.

 

ఈ క్రమంలోనే ఇలా ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో విలన్ తలను బాలయ్య నరుకుతారు. ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకుంది. అలాగే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో చివరిలో తల నరికే సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా నాని నటించిన దసరా సినిమాలో కూడా ఏకంగా రెండు సన్నివేశాలలో తల నరికే సీన్లు ఉన్నాయని తెలుస్తుంది.

ఇలా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సినిమాలలో తల నరికే సన్నివేశాలు ఉంటే సినిమా హిట్ అవడంతో ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తుంది. ఇలా తిరిగి ఫ్యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడమే కాకుండా ఇలాంటి సన్నివేశాలు ఉండే సినిమాలు మంచి హిట్ అవడంతో భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.ఇక ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

 

ఈ విధంగా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇలాంటి సన్నివేశాలను కనుక పెడితే ఇతర భాష ప్రేక్షకులు కూడా ఇలాంటి సన్నివేశాలను ఆదరిస్తున్న తరుణంలో ఇతర భాషలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇలా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందుతూ సత్తా చాటడంతో టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇలా ఒక్కో హీరో దాదాపు 100 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

 

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -