Lalu’s Son: ఎన్నికలైపోతే రాముడిని మరిచిపోతారు.. లాలూ కొడుకు సంచలన వ్యాఖ్యలు!

Lalu’s Son: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు అయోధ్య. ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ నెల 22 కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగా అయోధ్యలో జరగబోతున్న రాంలాలా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ కమిటీ ద్వారా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అయితే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి.

 

తాజాగా బీహార్ ప్రభుత్వంలో మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా కలలోకి రాముడు వచ్చి జనవరి 22న అయోధ్యకు వెళ్లబోమని చెప్పారు అని తెలిపారు తేజ్ ప్రతాప్. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే శ్రీరామచంద్రుడ్ని అందరు మరిచిపోతారు. అలాంటప్పుడు జనవరి 22వ తేదీన అయోధ్యకు రావడం అవసరమా? అని శ్రీరాముడు నాతో చెప్పాడు అని తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. అయోధ్యలో కపటనాటకం నడుస్తుంది. కాబట్టి నేను రావట్లేదని ఆయన నాకు వెల్లడించారు అంటూ స్టేజ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ సందర్భంగా బీజేపీపై తేజ్ ప్రతాప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బీజేపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశంలోని నలుగురు శకంరాచార్యుల కలలో కూడా రాముడు కనిపించాడు అనే విషయాన్ని చెప్పాడు. గత కొన్ని రోజుల క్రితం అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుకలకు వెళ్లడం గురించి అడిగినప్పుడు, మేము శ్రీకృష్ణుని భక్తులం, బృందావనం వెళ్తామని తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పాడు. ఇలా ఈ మధ్య కాలంలో తరచూ వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు తేజ్ ప్రతాప్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -