Adireddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే.. ఏమైందంటే?

Adireddy: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చూసిన వారికి ఆదిరెడ్డి బాగా తెలిసే ఉంటుంది. యూట్యూబర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఆదిరెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి తన వంతు విరాళం అందించారు ఆదిరెడ్డి. నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆ తర్వాత యూట్యూబర్ గా మారారు. తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కు యూట్యూబ్ లో రివ్యూలు ఇవ్వటం స్టార్ట్ చేసి బాగా పాపులర్ అయ్యారు.

 

సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ 6లో ఎంట్రీ ఇచ్చి హౌస్ లో తన ఆటతో ఆకట్టుకున్నారు ఆదిరెడ్డి. అయోధ్య రామ మందిరానికి తన వంతుగా లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నట్లుగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఈనెల 22న ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ మహత్కార్యంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. లక్షలాదిమంది భక్తులు విరాళం అందిస్తున్నారు.

తనవంతుగా లక్ష రూపాయలు డొనేట్ చేశానని రామ మందిరం నిర్మాణం మనందరి కల అని చెప్తూ మనమంతా చేయూతగా విరాళం అందించాలని పిలుపునిచ్చారు ఆదిరెడ్డి. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ట్రస్టు 900 కోట్లు విరాళాలుగా సేకరించాలని సంకల్పించింది. అందుకోసం 11 కోట్ల మంది ప్రజల నుంచి ఈ విరాళాలు సేకరణ చేయాలని భావించారు. శ్రీ రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఎవరు ఊహించని విధంగా 2023 డిసెంబర్ నాటికి రామ మందిరానికి 3200 కోట్లకు పైగా విరాళాలు అందాయి.

 

18 కోట్ల మంది రామభక్తులు బ్యాంక్ ఖాతాలో 3200 కోట్లకు పైగా విరాళాల రూపంలో జమ చేశారు ఈ మొత్తాన్ని ఆలయ ట్రస్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఈ మొత్తం మీద వచ్చే వడ్డీతోనే రామ మందిరం నిర్మాణం చేస్తున్నారు విరాళాల్లో అత్యధికంగా ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారి బాపు 11.3 కోట్లు విరాళంగా అందజేశారు. అంతేకాకుండా ఆయన అనుచరులు అమెరికా, యూకే దేశాల నుంచి 8 కోట్ల వరకు విరాళాలు సమకూర్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -