Ram Charan: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న చరణ్ దంపతులు.. ఏమైందంటే?

Ram Charan: ఈ జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. ఇప్పటిదాకా చిరంజీవి, ప్రభాస్, రన్బీర్ కపూర్ దంపతులు, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, ధనుష్ వంటి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.

 

అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ఉపాసన దంపతుల దగ్గరకు వెళ్లి రామ మందిర్ ట్రస్ట్ ప్రతినిధులు వీళ్ళని ఆహ్వానించారు. ఈ శుక్రవారం వీళ్ళని ఆహ్వానించగా రామ్ చరణ్ అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు.

దేశం అంతటి తరఫున తాను వెళ్లడంతో ఎంతో గర్వంగా ఉంది అని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ప్రత్యేకమైన రోజు అని తెలిపారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులను ఆహ్వానించారు ఇంకా చాలామంది ప్రముఖులను ఆహ్వానించవలసి ఉన్నది. ఈ జనవరి 22న జరుగుతున్న ఈ రాముని ప్రతిష్టాపన దేశవ్యాప్తంగా హిందువులకు ఒక పెద్ద పండుగలా ఉంటుంది. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దగ్గరకు చేరుతున్నాయి.

 

వాళ్లు జనవరి 22న వాళ్ళ ఇంట్లో ఉన్న రామునికి ఆ అక్షంతలు వేసి పూజ చేసుకుంటారు. దీనివలన ప్రతి ఒక్కరూ ప్రతిష్టాపన రోజు రామునికి పూజ చేసినట్టు ఉంటుంది. మరోవైపు హనుమాన్ చిత్రం బృందం ప్రీమియర్ షోలు నుంచి వచ్చిన డబ్బులు 14 లక్షల 25 వేలను రామ మందిరం నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం విశేషం. ఇప్పటికే మంచి టాట్ అందుకున్న ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియం నుంచి వచ్చిన ప్రతి టిక్కెట్ లో ఐదు రూపాయలను రామ మందిరం నిర్మాణానికి ఇస్తాము అని చిత్ర బృందం చెప్పారు. విడుదల తర్వాత మాటని నిలబెట్టుకొని ఆ డబ్బులను రామ మందిరానికి ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -