Devotional: శివాలయంలో ఈ పొరపాట్లు చేస్తే మాత్రం భారీ స్థాయిలో నష్టం కలుగుతుందా?

Devotional: శివ అన్న పదం లోనే ఒక తన్మయత్వం ఉంటుంది ఇక శివ దర్శనానికి వెళ్ళినప్పుడు ఉండే ప్రశాంతత గురించి చెప్పనవసరం లేదు. అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టడం సహజమే కానీ ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవడమా, మానటమా అనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

 

చిదంబర క్షేత్రంలో ఉండే హెచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడికి విచార శర్మ అనే కొడుకు ఉండేవాడు అతను వేదం చదువుతూ ఉండేవాడు. అతను తరచుగా గోవులని మేపేవాడు గోవులని కొట్టడం చూసేవాడు. అలా చేయటం మంచిది కాదు రేపటి నుంచి నేనే ఈ ఆవులని మేపుతాను అని ఆవులు కాచే అతనికి చెప్పటంతో వేదం చదువుకునేవాడు గోవులను కాస్తే మంచిదే అని అతను కూడా ఒప్పుకుంటాడు. గోవులను మేతకు తీసుకువెళ్లిన తర్వాత ఒకవైపు వాటిని మేపుతూ మరోవైపు వాటిని రక్షించడానికి పన్నాలను చదువుతూ ఆ గోవులని రక్షిస్తూ ఉండేవాడు.

ఆ పన్నాలని వినటం వలన ఆవులు కూడా ఎక్కువగా పాలిచ్చేవి. పిల్లవాడు రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం చేసి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. అది చూసిన గోవులు కాచే అతను పాలనీ వృధా చేస్తున్నాడని చెప్పి తండ్రికి ఫిర్యాదు చేస్తాడు. వెంటనే విచార శర్మ తండ్రి వచ్చి జరిగిందంతా చూసి కోపంతో ఉగ్రుడైపోతాడు. కొడుకుని తట్టి పిలుస్తాడు కానీ స్ఫూర్తి లేని విచార శర్మ అందుకు స్పందించడు అప్పుడు విచార శర్మ తండ్రి ఆ సైకిల్ లింగాన్ని కాలితో తంతాడు అప్పుడు బాహ్యస్మృతిలోకి వచ్చిన విచార శర్మ తన్నింది ఎవరో కూడా చూడకుండా ఆ కాలిని గొడ్డలితో నరికేస్తాడు.

 

అప్పుడు సైకతలింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించి ఈ రోజు నుంచి నువ్వు కూడా మా కుటుంబం సభ్యుడవే. ఐదవ స్థానం చండీశ్వరుడే కదా అందుకే అని చండీశ్వరుడు అని పిలుస్తాడు శివుడు. అంతేకాకుండా తను తినగా మిగిలిన ఆహారాన్ని కూడా చండీశ్వరుడికి ప్రసాదిస్తాడు మహాశివుడు. అందువలననే గుడిలో కొట్టిన ప్రసాదాన్ని చండీశ్వరుడికి చూపించి ఇంటికి తీసుకురావాలి అంతేకానీ అక్కడే వదిలేయకూడదు. అలా చేయటం వలన భారీ స్థాయిలో నష్టం కలుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pensioners Party Chief Subbarayan: ఒక్కో విశ్రాంత ఉద్యోగికి జగన్ 2.5 లక్షలు ఇవ్వాలట.. పాలనలో ఇంత అన్యాయమా?

Pensioners Party Chief Subbarayan: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఓటు వేయడానికి ముందు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన అభివృద్ధి జగన్...
- Advertisement -
- Advertisement -