Devotional: ఇక్కడ అమ్మవారిని బొట్టు పెట్టి ఏం కోరుకున్నా జరుగుతుందట.. మహిమ గల అమ్మవారంటూ?

Devotional: అడిగిన ఏ కోరికనైనా తీర్చే అమ్మవారట. అవును ఆ అమ్మవారి దగ్గరికి వెళ్లి ఏ కోరికను కోరినా అది తీర్చడమో లేకపోతే తీర్చే ధైర్యాన్ని మనకు ఇవ్వడం వంటివి జరుగుతాయట. అందుకే ఆమెను ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు. శ్రీశైలం మల్లన్న చెరువులో కొలువైంది ఈ అమ్మవారు. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు.

 

పక్షుల కిలకిలరావాలు, జలపాతాల సవ్వడి మధ్య సాగే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో తామరపూలు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల – శివలింగం ధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించారు. అందుకే ఇష్టకామేశ్వరిని పార్వతీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఇష్టకామేశ్వరి దేవత విగ్రహం చాలా విశిష్టమైనది.

ఈ రాతి విగ్రహాన్ని తాకితే చాలా గట్టిగా ఉంటుంది. అయితే నుదట కుంకుమ పెట్టినప్పుడు నుదురు వేలికి మెత్తగా చర్మంలా తాకుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందుతున్నారు. దేవి మందహసంతో భక్తులకు దర్శనం ఇస్తున్నది.భక్తులకు దేవిపై అపార నమ్మకం. రెండు మూడు మార్లు ఈ దేవిని దర్శించిన వారున్నారు. మళ్ళీ మళ్లీ వస్తుంటారు. దానికి కారణం వారు వచ్చివెళ్లిన తర్వాత కోరిన కోరికలు సాఫల్యం కావడమే.

 

కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావంగా ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు కోరుకొని వెళతారు, అవి నెరవేరుతాయి. దీనితో మళ్లీ వస్తారు. అసలు ఈ అమ్మవారి చరిత్ర ఏంటంటే, ఎంతోకాలం క్రిందట అడవిలో కొందరు చెంచులకు అమ్మ విగ్రహం కనిపించిందని, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరి‌స్తున్నారని అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -