Coconut In Puja: మహిళలు కొబ్బరికాయని కొడితే అశుభం జరిగే అవకాశాలు ఉన్నాయా.. ఏమైందంటే?

Coconut In Puja: హిందువులకి కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనది. అందుకే పూజలకి, వ్రతాలకి ఎక్కువగా కొబ్బరికాయని వినియోగిస్తారు. ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా కొబ్బరికాయని ప్రారంభిస్తారు. అలా చేయటం వలన ప్రారంభించిన పని సులువుగా పూర్తవుతుందని నమ్మకం. అయితే ఇటువంటి పవిత్రమైన కొబ్బరికాయని స్త్రీలు కొట్టకూడదు అని హిందూ మత విశ్వాసం. భార్య భర్తలు ఇద్దరూ గుడికి వెళ్తే కచ్చితంగా భర్త మాత్రమే కొబ్బరికాయ కొట్టాలి అని హిందూ మతం చెప్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరినీరు చంద్రునికి చిహ్నంగా ఉంటుంది.

దానిని దేవుడికి సమర్పించడం వల్ల సుఖము సంతోషము లభిస్తుంది. అలాగే దుఃఖము బాధలను కూడా తొలగిస్తుంది. ఇక స్త్రీలు కొబ్బరికాయను ఎందుకు కొట్టకూడదు అంటే స్త్రీలు సంతాన కారకులు. వారు ఒకే విత్తనం నుంచి సంతానం కలిగి ఉంటారు. అందుకే స్త్రీలు ఎప్పుడూ కొబ్బరికాయలని పగలగొట్టరు. ఒకవేళ అలా కొడితే అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. కొబ్బరి చెట్టుని పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లక్ష్మీదేవి దంపతులు భూమిపై నాటినట్లు చెబుతారు.

అందుకే కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అంటారు. మహా విష్ణువు లక్ష్మీదేవికి కొబ్బరి చెట్టు చాలా ప్రీతి అందుకే పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయని కలశంపై పెట్టటానికి కారణం కూడా దానికి ఉన్న పవిత్రత. కలశం పైన కొబ్బరికాయని ఉంచడం వినాయకునికి చిహ్నంగా భావించబడుతుంది. అన్ని పనులలో గణేశ పూజకు మొదటి స్థానం ఇవ్వబడింది అని నమ్ముతారు.అలాగే మరో కథనం ప్రకారం విశ్వామిత్రుడు ఇంద్రునిపై కోపం తెచ్చుకొని త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు.

ఆ కొత్త స్వర్గం నిర్మాణంతో సంతోషంగా లేనప్పుడు అతను వేరే భూమిని నిర్మించాలని అనుకున్నాడు. భూమిలో ఒక కొబ్బరికాయ రూపంలో మొదటి మనిషిని సృష్టించాడు అందుకే కొబ్బరికాయలు మనిషి అంటారు. కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని తొలగించడానికి సూచనగా భావిస్తారు. అంతే కాదు కొబ్బరికాయను కొట్టడానికి బలం అవసరం స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆనాటి కాలంలో భావించారు. అయితే భర్త అందుబాటులో లేని సమయంలో దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయ కొట్టవచ్చును అనే నిబంధన మాత్రం ఉన్నది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -