Devotional: అన్నం పెట్టమని ఇంటికి ఎవరైనా వస్తే అన్నం కచ్చితంగా పెట్టాలా.. పెట్టకపోతే అలాంటి పాపమా?

Devotional: దానధర్మాలు ధనికులు మాత్రమే చేయగలరు అనుకోవడం పొరపాటు. అవసరాన్ని బట్టి సామాన్యుడు కూడా అన్నదానాన్ని చేయవచ్చు. అన్నదానం యొక్క ప్రాముఖ్యం గురించి ఇప్పుడు చూద్దాం. మన శరీరాన్ని తయారు చేసే ఐదుమూలకాలలో అగ్ని ఒకటి. దీనికి సాధారణ ఆహార నైవేద్యాలు అవసరం. నైవేద్యం ఇవ్వకుంటే జీవితం సాగదు. అలాంటి శరీరానికి మనకి చేతనైన సహాయం చేసినప్పుడు ఆ చర్య వేలాది యజ్ఞాలు చేయడం కంటే ఎక్కువ.ఇది పుణ్యఫలాలని ఇస్తుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు “అన్నాద్ భవన్తి భూతాని” అంటే ఆహారం సమస్త సృష్టిని పోషిస్తుందని అర్థం. ఒక వ్యక్తి ఆకలిని తీర్చడం వల్ల ఇహ లోకంలో మంచి ఫలితాలు వస్తాయి. అన్నదానం కేవలం మనుషులకి మాత్రమే కాకుండా జంతువులకు మొక్కలకి కూడా ఇవ్వడం సృష్టిలో భాగం. కాబట్టి ఇంటికి అన్నం పెట్టమని వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని ఖాళీ కడుపుతో పంపించకండి. అలా చేయడం మహా పాపం. పంచభక్ష పరిమాణాలు పెట్టకపోయినా ఉన్న దాంట్లో వచ్చిన వాళ్ళ కడుపు నింపండి.

 

వచ్చిన వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులుగా భావించండి. మీరు చేసిన అన్నదానం వారికి పుణ్యాన్ని ఇవ్వడమే కాదు మీ జీవితాన్ని కూడా తరింప చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటికి వచ్చిన ఆవులకి, కుక్కలకి కూడా ఏమీ ఇవ్వకుండా పంపించకండి. అన్నదానం చేయడం వలన గత కర్మలను వదిలించుకోవటానికి సహాయపడుతుంది. మీ అన్నదానాన్ని స్వీకరించే వారి ఆశీర్వచనం మీ జీవితంలో సానుకూలతని తీసుకువస్తుంది.

 

అలాగే మీ పూర్వీకులని సంతోష పరచడంలోని వారికి మోక్షాన్ని పొందడంలో కూడా అన్నదానం సహాయపడుతుంది. ఆకలితో ఉన్న వాడికి పట్టడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు చేసినా రాదని పూర్వీకులు అందుకే చెప్పారు. ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు. అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలబడమే కనుక అత్యంత శ్రేష్టమైనది అన్నదానం.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -