Devotional: ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన వెంటే.. ఏం చేయాలంటే?

Devotional: ప్రతి వాడికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవాలంటే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే పనులు ఏవి చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. సంపాదించడం ఒక ఎత్తు సంపాదించిన డబ్బుని పొదుపు చేయడం ఒక ఎత్తు. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి లక్ష్మీదేవికి గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టే వాళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదట. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీతో పాటు ఇంట్లోనే స్థిరంగా ఉండాలంటే చాణిక్య నీతిని పాటించాల్సిందే.

అవునండి చాణక్యుడు లక్ష్మీదేవిని ఎలా గౌరవించాలో, ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండి పోతుందో ఎప్పుడో వివరించాడు. అదేమిటో చూద్దాం. పేదలకు సహాయం చేయడం చాలా మంచిది అవసరమైన వాళ్లకు మనకి తోచినంత సహాయం చేయడం వలన లక్ష్మీదేవికి మన మీద అనుగ్రహం కలుగుతుందట. అలా అని తనకు మాలిన ధర్మం చేయకూడదు, అపాత్ర దానం చేయకూడదు. అలాగే మీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేయకూడదు.

 

అలా చేయడం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. ఇతరులు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటే వారి దగ్గర మీరు డబ్బులు దొంగతనం చేయకండి. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకండి. గొడవలు పడే ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. అలాగే ఏంటి ఆడపిల్లని ఇంటి తోబుట్టువుని ఎప్పుడు కన్నీరు పెట్టించకండి అది ఆ ఇంటికి అరిష్టం. అలాగే తలుపులు శబ్దాలు చేస్తూ వెయ్యకూడదు శబ్దాలు చేస్తూ తీయకూడదు.

 

ఒకవేళ మీ తలుపులు శబ్దం వస్తున్నట్లయితే దానిని సరి చేయించండి. అలాగే చీపురు కట్టని కంటికి కనిపించని ప్రదేశంలో ఉంచితే మంచిది. అలాగే ఇంట్లో చెడిపోయిన గోడగడియారాలు ఉండకూడదు. వారానికి ఒకసారి అయినా ఇంటిని ఉప్పుతో తోడవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవ్వచ్చు. అలాగే సూర్యోదయానికి ముందే గుమ్మం అలికి ముగ్గులు పెట్టడం అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పని.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -