YCP: అలా చేస్తే మాత్రం ఏపీలో వైసీపీకి భవిష్యత్తు ఉండదా?

YCP: ఏపీలో గత ఎన్నికల్లో ఘనమై విజయకేతనం ఎగువవేసింది వైసీపీ. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 సీట్లు సాధించి, ప్రత్యర్ధులను మట్టికరింపించింది. ఇక ఇప్పుడు మరోసారి వచ్చే ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సారి 175 సీట్లు టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతోంది. అయితే దీనికి ముగుతాడు వేయాలని టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ కు దెబ్బకొట్టాలని భావిస్తున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. తెలంగాణలో పోల్చితే, ఏపీలో ఎన్నికలకు సమయం ఇంకా ఉంది. కానీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్, యువ నాయకులను ఎన్నికల రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియో వేదికగానూ గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీడీపీతో పవన్ పొత్తు ఆసక్తిగా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ రెండుసార్లు కలిశారు. ఈ సందర్భంలో పొత్తుపైనే మాట్లాడినట్లు తెలిసింది.

ఇప్పుడు టీడీపీకి మరో బలం కూడా చేకూరనుందని తెలిసింది. తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యతను జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నట్లు టాక్. ఈ క్రమంలోనే జనసేన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, ఇటు టీడీపీ నుంచి వస్తున్న తారక్ ఇద్దరూ కలిస్తే సునామీ సృష్టిస్తారని అంచనాలు. అటు వైసీపీ నేతలు సైతం ఈ విషయంపై కంగారులో ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరూ కలిస్తే సీఎం జగన్ అనుకునే సీట్లు 175… ఈ రెండు పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -