Peepal: రావిచెట్టు నీడ ఇంటిపై పడితే ఏం జరుగుతుందో తెలుసా?

Peepal: చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వాస్తు ప్రకారంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోకూడదు. వాటి వల్ల వాస్తు ధోషాలు కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. చెట్లను పెంచుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం అసలు మంచిది కాదు. కాగా హిందువులు రావిచెట్టును పవిత్రమైన చెట్టుగా భావిస్తారు.

రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. రావి చెట్టుపై సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అయితే రావి చెట్టును పవిత్రంగా భావించి, 24 గంటల పాటు ఆక్సిజన్ అందజేస్తున్నప్పటికీ, ప్రజలు తమ ఇంట్లో, పెరట్లో నాటుకోరు. మరి ఈ చెట్టును ఇంట్లో ఎందుకు ఉంచ‌కూడ‌దో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రావి చెట్టు మొక్కగా ఉన్నప్పుడు పర్లేదు కానీ పెద్దగా అయ్యే కొద్ది దానివేర్లు చాలా దూరం వ్యాపిస్తాయి.. క్రమంగా కొన్ని ఏళ్లకు అది పెద్ద వృక్షంగా మారుతుంది. ఇంట్లో ఈ చెట్టు పెరిగితే, దాని వేర్లు ఇంటి పునాదిని బలహీనపరుస్తాయి. ఇది ఇంటి పునాదిని కదిలించగలదు.

 

అందుకే ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు. అలాగే రావి చెట్టు 24 గంటల పాటు ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది. అందువలన, శరీరం అదనపు ఆక్సిజన్ పొందినప్పటికీ, అది మానవ శరీరానికి హానికరం అని నిరూపిత‌మైంది. ఈ కారణంగా ప్రజలు తమ ఇంట్లో రావి చెట్లను ఎద‌గ‌నీయ‌రు. అలాగే వాస్తు ప్రకారం రావి చెట్టు నీడ ఒక నిర్దిష్ట దిశ నుంచి ఇంటిపై పడితే ఆ కుటుంబ‌ స‌భ్యుల్లో అభిప్రాయ బేధాలు కలుగుతాయి. అందువ‌ల్ల‌ కుటుంబ పురోగతికి అడ్డంకులు సృష్టించవచ్చు. రావి చెట్టు నీడ మనసులో ప్రతికూల ప్రకంపనలు సృష్టిస్తుంది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రావి చెట్టు నీడ ఇంటిపై పడితే అది హానికరమని నమ్ముతారు. ఇది ఆ ఇంటి కుటుంబ సభ్యుల పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -