Marriage: పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఈ మూడు విషయాలలో కచ్చితంగా నష్టపోతారా?

Marriage: హిందూ సమాజంలో పెళ్ళికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు, మంచి చెడులు చూసుకొని సంబంధాలు కలుపుకునేవారు. అంతటి విశిష్టమైనది మన వివాహ వ్యవస్థ. వివాహం ఇద్దరి మనుషులని కాకుండా ఇరు కుటుంబాలను కూడా దగ్గర చేస్తుంది.

 

ప్రస్తుత తరానికి వివాహం యొక్క విశిష్టత మాంగల్య ధారణ మీద సరైన అవగాహన లేక ఆధునిక పోకడలకు అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు పెళ్లి జీవన పరమావధిగా ఉండేది కానీ ఇప్పుడు కెరీయరే జీవన పరమావధిగా మారి పెళ్లికి ప్రాముఖ్యం లేకుండా పోయింది. ఇద్దరూ మనుషులు కలిసి ఉండాలంటే పెళ్లి అక్కర్లేదు అంటూ సహజీవనం అని అగ్రిమెంట్ మ్యారేజ్ అని అర్థంలేని బంధాలను సృష్టిస్తున్నారు.

పెళ్లి అనేది వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు అనుకుంటున్న నేటి యువతరానికి పెళ్లి యొక్క ప్రాముఖ్యత కచ్చితంగా తెలియాలి. పెళ్లి అవసరమా అనే ప్రశ్న ఎదురైతే అవసరమనే చెప్తున్నాయి వేదాలు. మనిషిగా పుట్టి ఉంది జన్మరాహిత్యాన్ని సంపాదించుకోవడానికి. అలా జన్మరాహిత్యం పొందాలంటే మానవునిగా మూడు రుణాలు తీర్చుకోవాలి

 

పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం. ముందుగా దేవ రుణం గురించి మాట్లాడుకుందాం. ఈ సృష్టిలో ప్రతి భాగం మానవుడి కోసం ఉపయోగపడుతుంది అవి మనకి దేవత స్వరూపాలు ఉదాహరణకి గాలి నీరు నిప్పు మొదలైనవి వీటి రుణం తీర్చుకోవలసిన అవసరం మానవులుగా మనకి ఉంది. యజ్ఞాలు చేయడం ద్వారా వాటి రుణాన్ని తీర్చుకోవచ్చని వేదాలు చెబుతున్నాయి.

 

యజ్ఞం చేయడం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇక పితృ రుణం గురించి మాట్లాడుకుందాం. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయాలి. వంశాన్ని నిర్వీర్యం కాకుండా చూడవలసిన బాధ్యత మనది ఎందుకంటే మన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. పితృ కార్యాలు చేయడం కోసం సత్సంతానాన్ని కనటం వల్ల మన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే వాళ్ళం అవుతాం.

 

ఇక మూడోది ఋషి రుణం. వేద అధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణం తీర్చుకోవచ్చు. వేదాధ్యయనం చేయడం దానిని తరువాత తరాలకి అందించడం మానవునిగా మన బాధ్యత. ఇవేవీ తెలియని నేటి యువతరం పెళ్లి అవసరమా అంటూ సహజీవనానికి మొగ్గు చూపడం విచారకరం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -