NTR: తెలుగుదేశంకు ఓటేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు టీడీపీ లోకి ఎంట్రీ ఇస్తాడా? రాజకీయాలలో పాల్గొంటాడా అని టీడీపీ నేతలు ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గత కొంత కాలంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఎన్టీఆర్ సరిగ్గా అంచనా వేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట.
తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే చెప్పారట.

 

ఆయన చెప్పినట్టుగానే డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా రోజుల కిందటే జూనియర్ అన్నారట. ఆయన అంచనా వేసినట్టుగానే తెలంగాణలో హస్తం పార్టీ జెండా ఎగురవేసింది. ఎన్టీఆర్ పార్టీల జయాపజయాలపై కరెక్ట్ గా అంచనా వేయడం చూసి తారక్ సన్నిహితులు షాక్ అయ్యారట. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ఈసారి ఏపీలో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఇప్పటికే తన వాళ్ళతో ఎన్టీఆర్ ఎంతో నమ్మకంగా చెప్పారట.

దీంతో తమిళనాడు, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా జూనియర్ చెప్పిన ఫలితమే వస్తుందని సన్నిహితులు గట్టి నమ్మకంతో ఉన్నారు. కాగా తారక్ అంచనా వేసినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తరువాత, ఆ ఆనందంలో ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని వారి స్నేహితులతో పంచుకున్నారు. అలా అలా ఇది సోషల్ మీడియా అందరికీ తెలిసిపోవడమే కాకుండా, ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీదే విజయం అన్న జూనియర్ ఎన్టీఆర్ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఎన్టీఆర్ ఉద్దేశం ఏదైనప్పటికీ ఏపీ విషయంలో ఆయన చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -