Nagarjuna: నాగార్జున కొన్న కొత్త కారు ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nagarjuna: టాలీవుడ్ అగ్ర హీరో కింగ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ మన్మధుడుగానే రాణిస్తున్నారు నాగార్జున. ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికి 30 ఏళ్ల యువకుడి లాగే కనిపిస్తున్నారు. వయసు పెరుగుతున్న తరగని అందం నాగార్జున సొంతం అని చెప్పవచ్చు. ఇకపోతే నాగ్ ప్రస్తుతం సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో కాస్త జోరుని తగ్గించేశారు అని చెప్పవచ్చు. చాలా కాలంగా ఆయనకు సరైన హిట్టు పడడం లేదు. గత ఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్లు లేవు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

నాగార్జున కొనుగోలు చేసిన ఆ కారు ధర తెలిసి అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కియా ఈవీ6 అనే ఎలక్ట్రిక్ కారును ఆయన కొనుగోలు చేశారు. కియా ఈవీ6 ధర సుమారుగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో నాగార్జునతో పాటు భార్య అమల కూడా ఉంది. ఆ ఫోటో నేను చూసిన నేటిజన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -