Hindu Temple: ఈ హిందూ ఆలయం ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. అలా నిర్మిస్తున్నారా?

Hindu Temple: సాధారణంగా మన భారతదేశంలో హిందూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇలా మన దేశంలో పలు ప్రాంతాలలో ఎంతో ప్రాచీన పురాతనమైనటువంటి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఆలయాలు రూపొందాయి. అయితే మన దేశంలో ఇలా గొప్ప ఆలయాలు ఉండడం సర్వసాధారణం అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం నిర్మించారు.

ప్రస్తుతం నిర్మాణ పనులను జరుపుకుంటున్నటువంటి ఈ ఆలయం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నామని BAPS హిందూ మందిర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం కావడం ఈ ఆలయ ప్రత్యేకత. అబు మురేఖాలో 27 ఎకరాల విస్తీర్ణంలో జీవం పోసుకుంటున్న ఈ హిందూ దేవాలయాన్ని పూజ్య మహంత్ స్వామి మహరాజ్ నేతృత్వంలో బీఏపీఎస్ ఆలయాన్ని 2024, ఫిబ్రవరి 14న ఈ ఆలయం ప్రారంభం కానుంది.

 

ఇక ఈ ఆలయం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే భక్తులు ముందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోని అనే వెబ్ సైట్ కి వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2018 లోని ఈ ఆలయం భూమి పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ ఆలయం పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -