Temples: ఆలయాలకు వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Temples: మామూలుగా గుడికి ఎందుకు వెళ్తారు అని అడిగితే దేవుడిని ప్రార్థించడం కోసం, కోరిన కోరికలను నెరవేర్చమని అడగడం కోసం, మొక్కులు చెల్లించడం కోసం, దేవుడిని చూడడం కోసం అంటూ ఇలా రకరకాల సమాధానాలు చెబుతూ ఉంటారు. కానీ ఆలయానికి ఎందుకు వెళ్తారు వెళ్లడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే చాలా మంది చెప్పడానికి సందేహపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఆలయానికి ఎందుకు వెళ్తారు వెళ్లడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ నిర్మాణ సమయంలో అప్పటి ఆర్కిటెక్ట్స్ అయినా ఇప్పటి వారైనా ఎలక్ట్రానిక్, విద్యుత్ అయస్కాంత తరంగాలు కలిసే చోట మూల విరాట్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలా ఆలయాల్లో ప్రతిష్టించే ముందర రాగి రేకులను కాల్చి తరంగాలు ఉత్పత్తి అయ్యేలా ప్రతిష్టిస్తారు. దానివల్ల ఆలయ ప్రాంగణంలో సానుకూల సంకేత తరంగాలు వస్తాయి. ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల.. మనిషి శరీరంలో బాడీలో ఉన్నటువంటి షఠ్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి.

 

క్లాక్ వైజ్ డైరెక్షన్ అనగా లెఫ్ట్ టు రైట్ ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. ఆలయంలోని అర్చకులు పూజారులు చదివే ఆ మంత్రాల వల్ల న్యూరాన్స్ ఉత్తేజితమై ఆరోగ్యంగా ఉండవచ్చు. మంత్రాల ఉచ్ఛరణ వలన ఆ సానుకూల పవనాలు భక్తులకు అందుతాయి. ఇకపోతే ఆభరణాలు ధరించి టెంపుల్స్‌కు వెళ్లినట్లయితే అక్కడి సానుకూల తరంగాలను ఆభరణాలు గ్రహించి స్టోర్ చేసుకుంటాయి. అలాగే చాలామంది ఆలయంలోకి తడి బట్టలతో ప్రవేశిస్తూ ఉంటారు. ఆలయంలోకి స్నానం చేసి వెళ్లడం వల్ల తడి బట్టలు ఆక్సిజన్ ని ఎక్కువగా పీల్చుకొని ఆరోగ్యానికి ఎంతో మేలులను చేకూరుస్తాయి.

 

కాబట్టి ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆ భక్తులకు శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలాగే దేవుడిని కూడా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చి కష్టాల నుంచి కూడా ఘట్టెక్కిస్తారు. కాబట్టి టెంపుల్స్ వెళ్లాలి అంటే వెళ్ళాలి అన్నట్టు వెళ్లకుండా మనస్ఫూర్తిగా టెంపుల్స్ కి వెళ్లడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -