Kalyan Ram Wife: కళ్యాణ్ రామ్ భార్య చేసిన ఈ పనులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Kalyan Ram Wife: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. అలా నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. మొదట అతనొక్కడే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత పటాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

ఆ తర్వాత 118 తో పాటు బింబిసార లాంటి సినిమాలు కూడా సూపర్ హిట్ గా రావడంతో కళ్యాణ్ రామ్ అదే ఊపుతూ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే ఇటీవల అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో పలు కేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇకపోతే మామూలుగా కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీ విషయాలను బయట పెట్టడానికి పెద్దగా ఇష్టపడడు. ఆయన భార్య పేరు స్వాతి అన్న విషయం తెలిసిందే. ఆమె ఒక డాక్టర్.

 

2006 ఆగస్టు 10న కళ్యాణ్ రామ్ స్వాతి వివాహం జరిగింది. ఈ దంపతులకు అధైత, శౌర్యరామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక స్వాతి సొంతంగా విఎఫ్ఎక్స్ కంపెనీ నడుపుతున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలతో పాటు పలు టాలీవుడ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ పనులు అన్ని ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే కళ్యాణ్ రామ్ బింబిసార‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఈ సంస్థలోనే జరిగాయి. ఇక స్వాతి కాలేజ్ రోజుల్లో మహా చిలిపి పనులు చేసేవారట. ఆమె స్వతహాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునకు వీరాభిమాని. ముఖ్యంగా ఆమె కాలేజీ రోజుల్లో నాగార్జున సినిమాలు రిలీజ్ అయితే చాల ఫస్ట్ డే కాలేజ్ కు డుమ్మా కొట్టి మరి ఆ సినిమాలను చూడటానికి వెళ్లేవారట స్వాతి. నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మన్మధుడును కూడా ఫస్ట్ డే కాలేజ్‌కు బంక్‌ కొట్టి మరి ఆమె థియేటర్లో చూసిందట. ఈ విషయం కళ్యాణ్ రామ్ మీలో ఎవరు ? కోటీశ్వరుడు ప్రోగ్రాం లో స్వయంగా తెలిపాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -