Tarak Son: చిన్న కొడుకు విషయంలో తారక్ కాన్ఫిడెన్స్ కు ఫిదా కావాల్సిందే!

Tarak Son: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడంతో పాటు గత సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సినిమాలలో నటిస్తూనే సమయం దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తారక్. తారక్ కు ఇద్దరు కుమారులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. తారక్ భార్య నందమూరి కోడలిగా బాధ్యతలు చేపడుతూ పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె చాలా తక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. బయట కూడా ఎన్టీఆర్ భార్య చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. తన చిన్న కొడుకు భార్గవ్ రామ్ తనను మించిన సూపర్ స్టార్ అవుతాడు అని తారక్ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ తన కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్నాడు అన్న విషయం అర్థం అవుతోంది. మరి ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ తన తండ్రి ఆశించిన విధంగా తనకంటే గొప్పవాడు అవుతాడా లేదా అనేది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -