Nara Brahmani: నారా బ్రాహ్మణి గ్రేట్.. ఆ ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలను పెంచుతోందంటూ?

Nara Brahmani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.నందమూరి తారక రామారావు సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో కూడా ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్లారు.ఇలా సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయనకు ఎంతోమంది వారసులో ఉన్నప్పటికీ ఎవరూ కూడా ఈయన పేరు ప్రతిష్టలను నిలబెట్టలేకపోయారని చెప్పాలి.ఈయన వారసుడిగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరూ కూడా ఎన్టీఆర్ అంత గొప్ప స్థాయికి ఎదగలేదు.

సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ రాజకీయాలలో మాత్రం ఈయన సక్సెస్ కాలేకపోయారు.అలాగే పురందేశ్వరి హరికృష్ణ వంటి వారు కూడా రాజకీయాలలోకి వచ్చారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇక బాలకృష్ణ బిడ్డగా నందమూరి బ్రాహ్మిని అందరికీ ఎంతో సుపరిచితమే.విదేశాలలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి బ్రాహ్మిని తిరిగి ఇండియా వచ్చి తన తండ్రి చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు.

 

ఇలా నందమూరి ఆడపడుచుగా ఉన్నటువంటి నారా బ్రాహ్మణి నారావారి కోడలిగా అడుగు పెట్టింది. ఎంతో టాలెంట్ కలిగినటువంటి నారా బ్రాహ్మణి అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత తన మామయ్య వ్యాపార సంస్థలన్నింటినీ తన చేతులలోకి తీసుకున్నారు. ఇలా హెరిటేజ్ సంస్థను ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించడమే కాకుండా దేశవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరింప చేస్తున్నారు.

 

ఇలా ఈమె హెరిటేజ్ సమస్తకు మాత్రమే కాకుండా బసవతారకం హాస్పిటల్ బోర్డు మెంబర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా బాలకృష్ణ కుమార్తెగా చంద్రబాబునాయుడు కోడలిగా ఈమె వ్యాపార రంగంలో దూసుకుపోతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబడమే కాకుండా నారావారి నందమూరి వారి కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ కుటుంబ పరువును ఉన్నత శిఖరాలపై నిలబెట్టారనే చెప్పాలి. ఇలా తన పుట్టిల్లు మెట్టినిల్లు పరువు కాపాడటంలో బ్రాహ్మణి సక్సెస్ సాధించారని ఈ విషయంలో ఈమె చాలా గ్రేట్ అని చెప్పాలి.నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబ పరువు ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -