Vastu: ఇంట్లో అద్దం ఈ దిక్కున పెడితే డబ్బే డబ్బు.. ఏం చేయాలంటే?

Vastu: మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందువల్ల నూతన గృహాలు నిర్మించుకునే వారు వాస్తు నియమాలను అనుసరిస్తూ వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. ఇలా ఇంటిని మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకుంటారు.

ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అద్దం కూడా వాస్తు ప్రకారం అమర్చుకుంటారు. ఇలా వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో నిర్దిష్ట‌మైన ప్ర‌దేశాల్లో అద్దాల‌ను ఉంచ‌డం వ‌ల్ల వాస్తు దోషాలు తొల‌గిపోతాయి. ఇంట్లో వాస్తు దోషాలు పోవాలంటే అద్దాల‌ను ఏయే చోట్ల‌లో ఉంచాలి,ఇంట్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుంది ఏ దిశలో ఉంటే చెడు ఫలితాలు సంభవిస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

వాస్తు దోషాలు తొలగిపోవటానికి ఇంట్లో బేస్‌మెంట్‌లో లేదా నైరుతి దిశ‌లో బాత్‌రూమ్ నిర్మించుకోవాలి. ఇక బాత్ రూమ్ లో చ‌తుర‌స్రాకారంలో ఉండే అద్దాన్ని తూర్పుకు ఎదురుగా ఏర్పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల వాస్తు దోషం తొలగిపోతుంది. అంతే కాకుండా నిర్మాణ ప‌రంగా ఏమైనా వాస్తు దోషాలు ఏర్ప‌డినా తొల‌గిపోతాయి.

 

అలాగే ఇంట్లో ఏ భాగంలోనైనా గోడ కూలిన‌ట్లు, ప‌గిలిన‌ట్లు లేదా చీక‌టిగా ఉన్నా కూడా ఆ ప్ర‌దేశంలో అద్దాన్ని ఏర్పాటు చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వ‌ల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇలా అద్దాలు అమర్చుకోవడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -