Ganesha: వినాయకుని ముందు గుంజీలు తీస్తే ఆ సమస్యలు దూరమవుతాయా.. ఏమైందంటే?

Ganesha: మాములుగా మనం విగ్నేశ్వరుడి గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు గుంజీలను తీస్తూ ఉంటారు. అయితే అలా గుంజీలను ఎందుకు తీస్తారు? అలా తీయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? అన్న విషయాలు చాలా మందికి తెలియదు. మరి వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వినాయకుడి ముందు అందరూ గుంజీలు తీస్తారు. అలానే ఏదైనా పూజని మొదలుపెట్టేముందు, కచ్చితంగా మొదట వినాయకుడిని కొలిచి, ఆ తర్వాత మరే దేవుడునైనా మనం పూజిస్తూ ఉంటాము.

గణేష్ కి అటుకులు, బెల్లం, చెరుకు, కుడుములు, ఉండ్రాళ్ళు అంటే ఇష్టం. వీటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే, ఇక గుంజీలు తీసే విషయానికి వస్తే.. శ్రీమహావిష్ణువు మేనల్లుడైన గణపతికి బహుమతులు తీసుకువచ్చే వారట. ఆ బహుమతుల్ని చూపిస్తూ సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారు విష్ణువు. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని మింగేశారట. కాసేపటికి సుదర్శన్ చక్రం ఏది అని అడిగితే, మింగేసానని చెప్పాడు వినాయకుడు. మహావిష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలి అని చివరికి చెవులు రెండు పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు.

 

ఇక.అది చూసి, ఆనందం వేసి, పెద్దగా నవ్వాడు వినాయకుడు. నవ్వుతున్నప్పుడు సుదర్శన చక్రం బయటకు వచ్చింది. అప్పటి నుండి కోరికలు నెరవేరాలంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయడం ఆచారంగా మారింది. అందుకని మనం కూడా ఏదైనా కోరికలు నెరవేరాలంటే, వినాయకుడిని ప్రార్థించేటప్పుడు గుంజీలు తీస్తే, అప్పుడు అనుకున్నవి జరుగుతాయి. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నాము.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -