Vinayaka Chavithi :చవితి రోజున వినాయకుడిని ఏ విధంగా పూజించాలి.. పూజ సమయం ఏది?

ప్రతి ఏడాది భారతీయులు వినాయక చవితిని పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసే వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడంతో ప్రాముఖ్యత మరింత పెరిగింది అని, వినాయక చవితి రోజున రవి యోగం శుక్ల యోగం చిత్రా నక్షత్రం కలయిక యాదృచ్ఛికం జరిగిందని చెబుతున్నారు. కాగా తెలుగు వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటారు. అటువంటి గణపతిని ప్రత్యేకమైన పూజలతో, పండ్లు పలహారాలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కొలిచే పండుగ వినాయక చవితి. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31వ తేదీన బుధవారం రోజున జరుపుకోనున్నారు.

మరి వినాయకుడిని ఏ విధంగా పూజించాలి? ఈ సమయంలో పూజించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గణపతిని పూజించడానికి అనుకూలమైన సమయం 31 ఆగస్టు 2022 న వచ్చే గణేష్ చతుర్థి రోజున గణేష్ ని పూజించడానికి ఉత్తమ సమయం ఉదయం 11:07నుండి మధ్యాహ్నం 01:39 వరకు. ఆ రోజు గణపతి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమై అప్పటి నుంచి దాదాపుగా 10 రోజుల పాటు జరగి చివరగా అనంత చతుర్దశి రోజున ముగుస్తాయి. పూజలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయానికి వస్తే.. అయితే సాధారణంగా గణపతి పూజా సమయంలో కొన్ని నియమాలను, ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే వ్యక్తి శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు ఉంటాయి. గణపతి పూజలో మరిచిపోయి కూడా తులసి ఆకులను ఉపయోగించరాదు.

అదేవిధంగా, గణపతి పూజలో ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులను పరిస్థితుల లోను సమర్పించకూడదు. వినాయకుడిని ఎలా పూజించాలి..గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించడానికి, ముందుగా గణేష్ విగ్రహాన్ని ఒక ఎర్రటి వస్త్రంతో ఒక ఆసనంపై ఏర్పాటు చేసుకోండి. దీని తరువాత గణపతిని ఆవాహన చేయండి. ఆ తరువాత విగ్రహానికి పాలు , పెరుగు , తేనె , స్వచ్ఛమైన నెయ్యి , గంగాజలం మొదలైన వాటితో శుభ్రం చేయండి. అనంతరం గణపతి విగ్రహానికి పుసుపు పూసి కుంకుమతో అలంకరించండి. తరువాత, బట్టలు, వస్తువులతో సముచితంగా అలంకరించండి. ఉండ్రాళ్ళను, పండ్లు , చెరకు , అరటి , తమలపాకులు సమర్పించండి. ధూప దీప నైవేద్యంతో గణపతిని పూజించి గణపతి వ్రత విధాన కథను పటించండి. ఈ విధంగా మనం ఆ గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మన కోరిన కోరికలు నెరవేర్చుతాడు అని నమ్మకం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -