Rajamouli: ఆ ఒక్క తప్పు వల్లి డైరెక్టర్ రాజమౌళి కెరీర్ కు నష్టం కలుగుతోందా?

Rajamouli: టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. కాగా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు రాజమౌళి. మొదట శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా డైరెక్షన్ రంగంలోకి అడుగు పెట్టారు రాజమౌళి.

అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక చివరిగా తెరకెక్కించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకి ఏకంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ తో పాటు, గ్లోబల్ స్టార్ అవార్డు, ఆస్కార్ అవార్డు కూడా వరించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి భారీగా గుర్తింపు దక్కింది. అయితే అంత టాలెంట్ క్రేజ్ ఉన్న రాజమౌళికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందట. అదే కోపం. రాజమౌళికి కోపం వస్తే అసలు త‌న‌ని తాను కంట్రోల్ చేసుకోలేడ‌ట.

 

ఎదుట ఉన్నవారు ఎంతటి వాడైనా సరే చివరికి తన దగ్గర బంధువులైనా.తన ఆత్మీయులైనా సరే వారిపై కోపం చూపించేస్తాడట. పక్కన ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పగిలిపోవాల్సిందేనట. అలా విసిరి కొట్టేస్తాడ‌ట‌. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడ‌ట. కోపం తగ్గిన కొంచెం సేపటి తరువాత ఆయన ఏమన్నాడో రియలైజ్ అయ్యి ఇలా అనేసానే అని బాధపడతాడట‌. అయితే ఇది బ్యాడ్ హాబిట్టా ? మనందరిలో కామన్ గా ఉండేదేగా అని చాలామంది అనుకోవచ్చు కానీ రాజమౌళి లాంటి ఓ టాప్ డైరెక్టర్ కూడా తన కోపాన్ని కట్రోల్ చేసుకోలేడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -