Relationship: సెక్స్ సమయంలో మంటగా ఉందా.. కారణం ఇదే?

Relationship: భార్యాభర్తల మధ్య సెక్స్ ఎంతో కీలకమైనది. సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని తెలపడంతో పాటు వారి బంధాన్ని మరింత దగ్గరకు చేస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోవాలంటే లైంగిక జీవితం ఆనందంగా ఉండాలి. అయితే ఈ సెక్స్ లో భార్య భర్తలు పాల్గొన్నప్పుడు మొదటిసారి కలిసినప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తరచూ శృంగారంలో పాల్గొంటున్నప్పుడు కూడా నొప్పిగా మంటగా అనిపిస్తుంది అంటే దాని కారణాలు తెలుసుకొని వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. మరి కలయిక సమయంలో మంటగా అనిపిస్తుంది అంటే దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

కలయిక సమయంలో చాలావరకు దంపతులలో భయం ఉంటుంది. ఆ భయం కారణంగానే వాళ్లు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ముందు అసౌకర్యానికి గురౌతారు. ఆ తర్వాత నొప్పి ఉంటుందేమో తాము సరిగా స్పందించలేమేమో, బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఆనందించలేమో ఇలా లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ ఉంటారు. అయితే మాములుగా తొలి కలయిక మీద ఈ అనుమానాలు ఉండటం సర్వ సాధారణం. ఇక బరువు ఎక్కువగా ఉండటమే మీ సమస్య అనుకుంటే సరైన డైట్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా చాలమందికి యోనిలో నొప్పి, మంట బాధిస్తూ ఉంటుంది. వాటి కారణంగా వారు కలయికను ఆస్వాదించలేరు. అలాంటివారు కారణం తెలుసుకోవాలి. కొందరిలో జననాంగాలు పొడిబారతాయి.

మోనోపాజ్ దశలోనూ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. మోనోపాజ్ తర్వాత యోని మార్గంలోని పొర పల్చగా మారుతుంది. ఆ భాగం పొడిబారడం వల్ల నొప్పి వేధిస్తుంది. అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే పరిష్కారం ఇట్టే లభిస్తుంది. ఇన్ఫెక్షన్ లు గర్భాశయ ముఖద్వారానికి సంబందించిన సమస్యలు ఉన్నా కూడా ఇలా అవుతుంది. ముఖ్యంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఈ నొప్పి కి కారణం అవుతాయి. కొందరికి ప్రసవ సమయంలో యోని భాగంలో గాయాలౌతుంటాయి. దాని వల్ల కూడా నొప్పి బాధించొచ్చు. లేదంటే లైంగికంగా సక్రమించే వ్యాధులు ఉండొచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -