YCP: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గెలుపు సులువు కాదా?

YCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ చదరంగం రసవత్తంగా మారుతుంది. రాజకీయ కసరత్తులు మహా జోరుగా సాగుతున్నాయి ఎన్నికల బరిలో ఎలా అయినా గెలవాలని తెలుగుదేశం, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ తెగ ప్రయత్నిస్తున్నాయి. అధికారంలో నిలబడటం కోసం రాజకీయ కసరత్తులు మొదలుపెట్టిన జగన్ అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలలో అభ్యర్థులను ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో ఐదవ విడత కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

 

ఇప్పటివరకు 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో 58 స్థానాలు ఉన్నాయి. రాయలసీమలో అతి కీలకమైన కర్నూలు జిల్లాలో పట్టు సాధించడం కోసం ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరి అవంతికను బరిలోకి దింపే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. 2014 -19 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. మళ్లీ అక్కడ పట్టు నిలవాలంటే ఒక మహిళను నియమించటం అవసరం అని భావిస్తుంది వైసీపీ. ఎందుకంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి భూమ అఖిలప్రియ పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.

తెలుగుదేశం మహిళలకు ఛాన్స్ ఇస్తుండటంతో వైసీపీ కూడా ఆమెకు పోటీగా ఒక మహిళని బరిలోకి దింపుతుంది. ప్రస్తుతం అవంతిక హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. అవంతిక హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు మఖాం మార్చారు ఆళ్లగడ్డలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించే మహిళలకు బహుమతులు అందజేశారు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుకుగా కనిపిస్తున్నారు. ఆళ్లగడ్డ సీటు కోసం తెదేపా సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె ఏవి జస్వంతి పోటీ పడుతున్నారు.

 

అయితే తెదేపా భూమా అఖిల ప్రియకే సీటు ఇచ్చేందుకు సుముఖం చూపిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలకు నిజం చేకూరుస్తూ ఆళ్లగడ్డలో చంద్రబాబు నిర్వహించిన సభ లో భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డి తదితరులని సమావేశానికి రానీయకుండా అన్ని తానై వ్యవహరించింది. అలాంటి అఖిలప్రియ పై మరో మహిళ అయితేనే ఫలితం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -