Akkineni Heroes: అక్కినేని హీరోలకు హిట్ ఇవ్వడం ఏ డైరెక్టర్ కు సాధ్యం కాదా?

Akkineni Heroes: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని హీరోల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కినేని హీరోల పరిస్థితిని అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా పాపం అని అంటున్నారు. నాగచైతన్య నాగార్జున అఖిల్ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి కూడా సరైన హిట్టు రావడం లేదు. ఈ ముగ్గురు హీరోలు నటించిన సినిమాలో వరుసగా ఫ్లాప్ గా నిలుస్తున్నాయి. కష్టపడుతున్నప్పటికీ ఆ కష్టానికి తగ్గ ఫలితం లభించడం లేదు. గత కొన్నేళ్లలో అసలు అక్కినేని ఫ్యామిలీ నుంచి చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు.

ఒక బంగార్రాజు సినిమా మాత్రమే హిట్ అయినా అది మల్టీ స్టారర్ సినిమా. పైగా అది కూడా సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా రావ‌డం క‌లిసొచ్చింది. కొడుకులు నాగచైతన్య అఖిల్ సంగతి పక్కన పెడితే హీరో నాగార్జున నటిస్తున్న సినిమాలు కూడా ఘోరంగా ఉంటున్నాయి. మన్మధుడు2 .ది ఘోస్ట్, ఆఫీసర్, ది వైల్డ్‌ డాగ్ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ సినిమాలతో నాగార్జున పరువు ఘోరంగా పోయింది. ఇక తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ హీరో అయ్యి ఏడు సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ సరైన హిట్ లేదు.

 

ఇప్పటివరకు అఖిల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. అఖిల్ కెరీర్ పై నాగార్జున ఫ్యామిలీ ఎంతో టెన్షన్ పడుతోంది. ఇక నాగచైతన్య కూడా వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్నాడు. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ ఇలా వరుసగా డిజాస్టర్లు వచ్చాయి. ఇలా తండ్రి కొడుకులకు వరుసగా ప్లాప్‌లు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా కథలు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చైతు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో అక్కినేని హీరోల కెరియర్ ముగిసిపోయిందా. అక్కినేని సీరియల్ జాతకాలు ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -