Sunil-Jhansi: ఝాన్సీ సునీల్ గురించి అలాంటి వార్తలకు కారణమిదేనా?

Sunil-Jhansi: చిత్ర సీమ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇదో మాయాలోకం. ఎప్పుడు ఎవరికి ఎలా అవకాశాలు వస్తాయో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎవరు ఎవరితో ఎఫైర్‌ నడుపుతారో, ఎవరితో గొడవపడుతారో కనిపెట్టడం కూడా సులువేం కాదు. స్టార్స్‌గా ఉన్న నటులు జీరో అవ్వడం.. జీరోగా ఉన్న నటులు స్టార్స్ అవడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి. కేవలం స్టార్ హీరో హీరోయిన్స్‌నే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయంలోనూ ఇలానే జరిగింది. అప్పటివరకు స్టార్‌ యాంకర్‌గా పేరు సంపాదించుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ, ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంది. ఎంతలా అంటే ఝాన్సీ ఆ సినిమాలో ఉంటే కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మేవారు.

 

 

అప్పట్లో అంతలా జనాల్లో తన పేరుని ముద్రించుకునేలా చేసుకుంది యాంకర్ ఝాన్సీ. యాంకర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి ఆ తర్వాత తనదైన స్టైల్‌లో పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి మెప్పించింది. స్టార్ కమెడియన్ సునీల్‌తోనూ కలిసి నటించింది ఝాన్సీ. మంచి మార్కులు వేయించుకుంది. ఇప్పటికీ వీళ్ళకి సంబంధించిన ఫన్నీ సీన్స్‌ను మనం యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటాం.

 

ఇదే క్రమంలో అప్పట్లో యాంకర్ ఝాన్సీకి సునీల్‌కి మధ్య సంబంధం అంటూ పుకార్లు షికార్లు చేశాయి. దానికి మెయిన్ రీజన్ పెళ్లైన కొత్తల్లో సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించడమే కారణమంటూ అప్పట్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది. అయితే మేము మంచి ఫ్రెండ్స్ అంటూ ఎప్పటికప్పుడు ఆ వార్తలను క్లియర్ చేస్తూనే వచ్చింది ఝాన్సీ. కాగా ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకుంది. లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే అప్పట్లో ఆ రూమర్స్‌ వచ్చాయనే టాక్‌ కూడా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -