Pulsar bike Jhansi: టైలర్ కొలతలు తీసుకుంటూ ఝాన్సీతో అలా చేశాడట.. ఏం జరిగిందంటే?

Pulsar bike Jhansi: గాజువాక బస్ డిపో కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పల్సర్ బైకు పాట ద్వారా ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. గాజువాక డిపో బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఝాన్సీకి డాన్స్ అంటే ఎంతో మక్కువ ఇలా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో మక్కువ ఉండేది ఇలా డాన్స్ అంటే ఎంతో ఇష్టమని తెలియడంతో తన భర్త కూడా తనని ప్రోత్సహించారని ఈమె తెలియజేశారు.

ఇలా తన భర్త ప్రోత్సాహంతో పలు స్టేజి షోలలో పాల్గొన్నానని, అలాగే గతంలో బుల్లితెర కార్యక్రమాలలో కూడా తాను పెర్ఫార్మెన్స్ చేశానని ఝాన్సీ ఇదివరకు తెలియజేశారు.ఇలా స్టేజి షో లలో సందడి చేస్తున్నటువంటి ఝాన్సీ ఏకంగా పల్సర్ బైక్ పాట ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇలా ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నారు.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను పల్సర్ బైకు పాట ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యానని చాలామంది అనుకుంటున్నారు. కానీ దాని వెనుక 18 సంవత్సరాల కష్టం ఉందని ఈ సందర్భంగా ఝాన్సీ తెలియజేశారు. ఇక తనకు తన జీవితంలో జరిగినటువంటి ఒక చేదు సంఘటన గురించి కూడా ఈ సందర్భంగా ఈమె బయట పెట్టారు.

 

ఒకప్పుడు తాను టైలర్ దగ్గరకు కొలతలు కోసం వెళ్లగా ఆయన తన కొలతలు తీస్తూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ విషయం తన తండ్రికి చెప్పి టైలర్ కు బుద్ధి వచ్చేలా చేయాలని తండ్రి దగ్గరకు వెళ్ళగా తన తండ్రి మాత్రం నేను నీ తండ్రిని కాదని చెప్పమన్నారని ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఝాన్సీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -