Niharika Konidela: జూనియర్ ఎన్టీఆర్ అంటే హీరోయిన్ నిహారికకు ఇంత ఇష్టమా?

Niharika Konidela: మెగా డాటర్ కొణిదెల నిహారిక చాలా గ్యాప్ తరువాత నటించిన తాజా వెబ్ సిరీస్ డెడ్ పిక్సల్స్. ఇందులో నిహారికతో పాటు అక్షయ్ లాగసాని, వైవా హర్ష, సాయి రోనాక్ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ వెబ్ సిరీస్ మే 19వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు.

ఈ సందర్బంగా ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తూ.. మెగా నటులు కాకుండా, బయట హీరో ఎవరు ఆమెకి నచ్చిన వ్యక్తి అని అడిగగా ఎన్టీఆర్ అని సమాదానం ఇచ్చింది నిహారిక. ఈ సందర్బంగా నిహారిక మాట్లాడుతూ..ఎన్టీఆర్ గ్రేట్ పెర్ఫార్మర్ అని, అలాగే అతను ఒక అల్ రౌండర్ అని తెలిపింది. అందుకని ఎన్టీఆర్ #NTR అంటే ఇష్టమట. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్నీ కూడా చూస్తుందట. అలాగే తనకు దెయ్యం సినిమాలంటే చాలా భయంఅని తెలిపింది. కాగా ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా నిహారిక చేసిన వాఖ్యలపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తేయని వీరు విడాకులు తీసుకున్న విడిపోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇటు నిహారిక కానీ అటు చైతన్య కానీ స్పందించడం లేదు. అలాగే కూతురు విషయంలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నాగబాబు సైతం ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -